నిన్న మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ప్రపంచం మొత్తం సాహో ఫోబియా పట్టుకుంది. బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఈ సినిమాపై డార్లింగ్ ఫ్యాన్స్ తో పాటుగా యావత్ సినీజనం ఎదురుచూసారు. గత నెల ముప్పైనా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముందునుండి ఈ సినిమాలోని కొన్ని క్లిప్ లను, పోస్టర్స్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ లో  ఆసక్తి ని తీసుకొచ్చిన సాహో సినిమా థియేటర్లలోకి వచ్చిన మొదటి రోజునే నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. 

ముందున్న ప్రభాస్ ఈ సినిమాలో కనిపించలేదు. బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ప్రభాస్ కు ఈ సినిమా పేరును పోగొట్టిందన్నవిషయం తెలిసిందే. మొదటి రోజే సినిమా పరిస్థితి తయారు మారైంది. అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తాపడింది సాహో అన్న సామెతకు కరెక్ట్ గా సరిపోయిందని చాలా మంది పేర్లు పెట్టారు. హాలీవుడ్ రేంజ్ అని అనుకుంటే అది ప్రభాస్ రేంజే కాదని సినిమాను చూసాను అందరు అంటున్నారు. 

కోట్లు పెడితే సరిపోదు కొద్దిగైనా కూడా జనాలకు అర్థమవ్వాలి. మనమేమి వండర్ ప్రపంచంలో లేము.. సినిమా తక్కువలో రూపొందించిన కూడా పదిమంది చూసేలా ఉండాలని ప్రభాస్ ఫ్యాన్స్ డైరెక్టర్ సుజిత్ పై దుమ్మెత్తిపోశారు. ఈ సినిమా ఉన్నపుడు ఏ సినిమా బరిలోకి దిగినా తట్టుకోలేదేమో అని చాలా సినిమాలు రిలీజ్ డేట్ ను మార్చుకున్నాయి. 

వివరాల్లోకి వెళితే.. ఇవాళ న్యాచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సాహో తో పోలిస్తే ఈ సినిమాకు ఎటువంటి ఆర్బాటం చేయకుండా ఒక్క ప్రెస్ మీట్ తోనే సరిపెట్టుకున్నారు. ఇక బడ్జెట్ విషయానికొస్తే తక్కువ బడ్జెట్ తో తెరకెక్కింది. కుటుంబ కథా చిత్రంగా థియేటర్లలోఇవ్వాళ సందడి చేసిన ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి టాక్ తో దూసుకుపోతుంది. కొంచం కొత్తగా సాగిన ఈ సినిమా మొదటి షో కే ఫుల్ కలెక్షన్లతో పాటుగా పాజిటివ్ గా టాక్ తో దూసుకుపోతుంది. దీనితో చాలా మంది తక్కువ బడ్జెట్ తో వచ్చి న గ్యాంగ్ లీడర్ సినిమా సక్సెస్ అయ్యి సాహో పరువు తీసిందని అంటుంటారు. మరి ఎంతవరకు ఈ సినిమా కలెక్షన్స్ వస్తాయో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: