సీనియ‌ర్ హీరోయిన్ ల‌క్ష్మి న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆమె న‌ట‌న‌ను మ‌నం కొన్ని ద‌శాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. ఎన్నో సినిమాల్లో ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ఆమె తెలుగు ప్ర‌జ‌ల హృద‌యాల్లో కొలువై ఉండిపోయారు. మురారి లాంటి సినిమాల్లో ఆమె చేసిన పాత్ర ఎప్ప‌ట‌కీ అలా గుర్తుండి పోతుంది. ఇక చాలా గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ ఆమె నాని న‌టించిన గ్యాంగ్ లీడ‌ర్ సినిమాతో తెర‌పై క‌నిపించింది. విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.


ఈ సినిమాలో ఇద్ద‌రు పిల్ల‌ల‌తో పాటు హీరోయిన్  ప్రియాంక అరుల్ మోహన్, మ‌రో సీనియ‌ర్ న‌టి శ‌ర‌ణ్య‌తో పోటీప‌డి మ‌రీ ఈ వ‌య‌స్సులోనూ చాలా ఎన‌ర్జీతో ల‌క్ష్మి చేసిన న‌ట‌న‌కు హ్యాట్సాఫ్ అనాల్సిందే. క‌థ‌లో దొంగ‌త‌నం జ‌రిగాక  14 నెల‌లు త‌ర్వాత స‌రస్వ‌తి(ల‌క్ష్మి).. మ‌ధ్య వ‌య‌స్కురాలైన వ‌ర‌ల‌క్ష్మి (శ‌రణ్య‌), పెళ్లి కాబోతున్న అమ్మాయి ప్రియ (ప్రియాంక‌), స్కూల్ చ‌దువుతున్న అమ్మాయి స్వాతి(శ్రియారెడ్డి), ఐదారేళ్ల చిన్న‌పాప (పాణ్య‌)ల‌కు బహుమ‌తి వ‌చ్చింద‌ని అబ‌ద్ధం చెప్పి ఇంటికి ర‌ప్పిస్తుంది. అక్క‌డ నుంచే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది.  


ల‌క్ష్మికి ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌లు కొత్త కాక‌పోయినా ఈ వ‌య‌స్సులో ఈ త‌ర‌హా పాత్ర‌తో మెప్పించ‌డం నిజంగా గ్రేటే. ఆమె మరోసారి తన అనుభవాన్ని చూపించింది. సరస్వతి పాత్రలో గొప్పగా నటించింది. ఇటు కామెడీ.. అటు సెంటిమెంటులో ఆమె అదరగొట్టింది. ఆమె ఇన్నాళ్లు ఎందుకు బ్రేక్ తీసుకుందా ? అన్న డౌట్ వ‌చ్చేంత రేంజ్‌లో విజృంభించి మ‌రి న‌టించింది.


ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ ఆమెను ఈ సినిమాకు స‌రస్వ‌తి క్యారెక్ట‌ర్‌కు ఎంచుకోవ‌డంలోనే సగం స‌క్సెస్ అయ్యాడు. ఇక ఈ సినిమాలో ఆమె రోల్‌ను తెర‌మీద ప్ర‌జెంట్ చేయ‌డం.. ల‌క్ష్మీ జీవించేయ‌డంతో సినిమా రేంజ్ పైకి వెళ్ల‌డంతో ఆమె ఎంతో సాయం చేసింది. ఏదేమైనా ప‌క్కా పైసా వ‌సూల్ సినిమాతో ల‌క్ష్మీ రీ ఎంట్రీ ఇవ్వ‌డంతో ఆమెకు మ‌ళ్లీ వ‌రుస పెట్టి ఛాన్సుల మీద ఛాన్సులు రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: