అష్టాచమ్మ సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు నేచురల్ స్టార్ నాని.  టాలీవుడ్ లోకి మంచి దర్శకుడిగా తన సత్తా చాటాలని వచ్చిన నాని మొదట బాపు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉంటూ ఎన్నో మెలుకువలు నేర్చుకున్నాడు.  అంతలోనే తనకు అదృష్టం తలుపు తట్టినట్టు ‘అష్టాచమ్మ’ మూవీలో హీరోగా ఛాన్స్ వచ్చింది. అష్టాచమ్మ సినిమాతో యంగ్ హీరో నాని, నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ కెరీర్ ఒకేసారి మొదలైంది.

ప్రస్తుతం అవసరాల శ్రీనివాస్ నటుడిగా, దర్శకుడిగా తన సత్తా చాటుతున్నాడు. అయితే నాని హీరోగా మారిన తర్వాత దర్శకత్వం వైపు కాకుండా నటన వైపు మొగ్గు చూపారు. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తెర‌కెక్కించిన ‘అష్టాచమ్మ’తో మంచి విజయం అందుకోవడంతో హీరోగా వరుసగా ఛాన్సులు వచ్చాయి.  చిరంజీవి త‌ర్వాత ఏ అండదండ‌లు లేకుండా ఇంత‌గా మార్కెట్.. ఫ్యాన్స్ సంపాదించుకుంది ర‌వితేజ త‌ర్వాత నానినే. రైడ్, భీమిలి క‌బ‌డ్డి జ‌ట్టు  లాంటి సినిమాలు పేరు తీసుకొచ్చాయి కానీ కమర్షియల్ గా హిట్ కాలేదు. ఇక  ‘అలా మొద‌లైంది’,‘పిల్ల జమీందార్’ విజ‌యాల‌తో నాని క్రేజీ హీరో అయిపోయాడు. ఇక 2012లో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ’ సినిమా నానికి మంచి పేరు తెచ్చింది. 

ఇందులో నాని ఫుల్ లెన్త్ లేకపోయినా ఆ క్యారెక్టర్ మాత్రం బాగా ఎలివేట్ అయ్యింది.  ఆ తర్వాత నాని నటించిన కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాధ,జెంటిల్ మ‌న్,మ‌జ్ను,నేనులోక‌ల్,నిన్నుకోరి,ఎంసిఏ సినిమాల‌తో వ‌ర‌సగా ఎనిమిది విజ‌యాలు అందుకున్నాడు. దాంతో స్టార్ హోదా దక్కించుకున్న నాని దర్శక, నిర్మాతలకు మినిమం గ్యారెంటీ హీరో అయ్యాడు.  ఈ మద్య వస్తున్న సినిమాలు ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

అయితే కంటెంట్ లేకుండా కోట్లు కుమ్మరిస్తే ప్రేక్షకులు రిసీవ్ చేసుకోరని ప్రభాస్ నటించిన ‘సాహూ’ ఉదాహారణ అని చెప్పొచ్చు.  తెలుగు లో ఈ మద్య కోట్లు కుమ్మరించి సినిమాలు తీస్తున్న బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్ల పడ్డ సినిమాలు చాలా ఉన్నాయి. అలాంటిది నాని సినిమాలు మినిమం బడ్జెట్ తో రూపొందినా..థియేటర్లో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తూ కట్టిపడేసే సినిమాలే కావడం విశేషం. నేడు రిలీజ్ అయిన గ్యాంగ్ లీడర్ కూడా హిట్ టాక్ తెచ్చుకొని ప్రేక్షకులను ధియేటర్లకు క్యూ కట్టించేలా చేస్తుందని టాక్ వినిపిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: