కేరళ కుట్టి కీర్తి సురేష్ ...అందం అభినయం కలగలిపిన ముద్దుగుమ్మ . టాలెంట్ ఉంటె ఎలాంటి ఎక్సపోసింగ్ లేకుండానే హీరోయిన్గా నిలదొక్కుకోవచ్చు అని నిరూపించిన హీరోయిన్లాలో మొదటి వరుసలో ఉంటుంది ఈ భామ. ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచినప్పటి నుండి ఎక్కడ ఎక్సపోసింగ్ కి తావు ఇవ్వకుండా...భిన్నమయిన పాత్రలను పోషిస్తూ క్రేజ్ తెచ్చుకుంది కీర్తి సురేష్. ఈ అమ్మడు చేసిన సినిమాలు హిట్ అవుతున్నప్పటికీ ... తన నటన శక్తిని చాటే సినిమా ఒక్కటి కూడా రాలేదు అనుకుంటున్న తరుణంలో నాగ్ అశ్విన్ దర్శకత్వం లో సావిత్రి జీవిత లో నటించే ఛాన్స్ కొట్టేసింది. సావిత్రి లాంటి మహానటి పాత్ర పోషించటం చాలా కష్టమని.. కీర్తి ఆ పాత్రలో ఎలా నటిస్తుందో అనుకున్నారు అంతా...కానీ సినిమా విడుదలయ్యాక మహానటి సావిత్రి గారే వచ్చి నటించినట్టుంది. సావిత్రి పాత్రలో అంతలా జీవించేసింది కీర్తి సురేష్. .


కేవలం కీర్తి సురేష్ నటనే కాదు ...ఆమె అభినయం ... డైలాగ్ డెలివరీ ... ఇలా ప్రతి ఒక్కటి సావిత్రమ్మని తలపించాయి. కీర్తి సురేష్ తప్ప ఆ పాత్రలో ఇంకెవ్వరు నటించలేరు అనేంతగా నటించింది. మహానటి సినిమాలో కీర్తి సురేష్ నటనకి విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో కీర్తి సురేష్ రేంజే మారిపోయింది. ఆమె ఇండస్ట్రీ లో ఓ మహానటి అయిపోయింది. ఈ  సినిమాలో కీర్తి నటనకు ఏకంగా జాతీయ ఉత్తమ నటి పురస్కారమే వరించింది. దీన్ని రాష్ట్ర పతి చేతుల మీదుగా అందుకోనుంది.


అయితే ఈ అమ్మడు ఖాతాలో మరో అవార్డు వచ్చి చేరింది. కేరళ ప్రభుత్వం కీర్తిని ప్రత్యేక అవార్డుతో సత్కరించింది. ఓనం పండగా సందర్బంగా సీఎం పినరయి విజయన్ ఆమెను సన్మానించి అవార్డును అందజేశారు. ఒక్క మహానటి సినిమాతో ఇటువంటి ఎన్నో అవార్డులు అంతకుమించి ప్రేక్షకుల  అభిమానాన్ని సొంతం చేసుకుంది కీర్తి. 


మరింత సమాచారం తెలుసుకోండి: