సీనియ‌ర్ న‌టుడు స‌త్య‌ప్ర‌కాష్ పేరు చెప్ప‌గానే `పోలీస్ స్టోరీ` సినిమా గుర్తుకొస్తుంది. ఈ ఒక్క సినిమా అనే కాదు, ఎన్నో ఎన్నెన్నో సూప‌ర్ హిట్ సినిమాల్లో ప్ర‌తినాయ‌కుడిగానూ, ముఖ్య పాత్ర‌ధారిగానూ రాణించి ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందారు. 11 భాష‌ల్లో 500కు పైగా చిత్రాల్లో న‌టించిన ఈ సీనియ‌ర్ న‌టుడు తొలిసారిగా మెగాఫోన్ చేత‌బ‌ట్టారు. స‌త్య‌ప్ర‌కాష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం పేరు `ఉల్లాలా ఉల్లాలా`. గ‌త వేలంటైన్స్ డేకి భారీ ఎత్తున `ల‌వ‌ర్స్ డే`  చిత్రాన్ని విడుద‌ల చేసి మంచి నిర్మాత‌గా పేరు తెచ్చుకున్న సుఖీభ‌వ మూవీస్ అధినేత ఎ.గురురాజ్ `ఉల్లాలా ఉల్లాలా` చిత్రాన్ని ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. న‌ట‌రాజ్‌, నూరిన్‌, అంకిత హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది.


ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు స‌త్య‌ప్ర‌కాష్ మాట్లాడుతూ ``తెలుగు, త‌మిళం, క‌న్న‌డం, మ‌ల‌యాళం, ఒరియా, బెంగాలీ, భోజ్‌పురి, మ‌రాఠీ, పంజాబీ, హిందీ, ఇంగ్లీషు భాష‌ల్లో 500కు పైగా సినిమాల్లో న‌టించాను. `పోలీస్ స్టోరీ`, `సీతారామ‌రాజు`, `పెళ్లి చేసుకుందాం`, `స‌మ‌ర సింహారెడ్డి`, `మాస్ట‌ర్‌`, `డేంజ‌ర్‌`, `లాహిరి లాహిరి లాహిరిలో`, `బిగ్ బాస్‌` త‌దిత‌ర చిత్రాలు నాకెంత‌గానో పేరు తెచ్చిపెట్టాయి. ఇన్నేళ్ల కెరీర్‌లో న‌టుడిగా పూర్తిస్థాయి సంతృప్తితో ఉన్నాను. ద‌ర్శ‌క‌త్వం చేయాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నాను. ఇప్ప‌టికి కుదిరింది. ఇదొక రొమాంటిక్ ఎంట‌ర్‌టైనింగ్  థ్రిల్ల‌ర్‌. ఈ సినిమాలో చాలా వింత‌లూ విశేషాలూ ఉన్నాయి. ఎవ్వ‌రూ ఊహించ‌ని రీతిలో ఈ సినిమా ఉంటుంది. మేకింగ్ ప‌రంగా కూడా చాలా కొత్త‌గా ఉంటుంది. ద‌ర్శ‌కునిగా నా తొలి చిత్రానికి గురురాజ్‌లాంటి నిర్మాత దొర‌క‌డం నా అదృష్టం`` అని చెప్పారు.


నిర్మాత ఎ.గురురాజ్ మాట్లాడుతూ ``స‌త్య‌ప్ర‌కాష్ నాకెప్ప‌టి నుంచో మంచి స్నేహితుడు. న‌టునిగా అత‌నిలో ఎంత ఫైర్ ఉందో, ద‌ర్శ‌కునిగా అంత‌కు మించిన ఫైర్ ఉంది. ఈ చిత్రానికి నేనే క‌థ‌ను అందించాను. మేకింగ్ ప‌రంగా ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. `ఉల్లాలా ఉల్లాలా` చిత్రం నిర్మాత‌గా నాకు, ద‌ర్శ‌కునిగా స‌త్య‌ప్ర‌కాష్‌కూ క‌చ్చితంగా ఓ ట‌ర్నింగ్ పాయింట్ అవుతుంది. షూటింగ్ కార్య‌క్ర‌మాలు తుదిద‌శ‌కు చేరుకున్నాయి. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కూడా శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అతి త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తాం`` అని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: