నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రం కె కుమార్ డైరక్షన్ లో వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా నాని ఖాతాలో మరో హిట్టు పడేలా చేసింది. ఓ పక్క ఫన్ ఎలిమెంట్స్ తో పాటుగా మరో పక్క రివెంజ్ డ్రామాని బాగా నడిపించాడు దర్శకుడు విక్రం కె కుమార్.


విక్రం డైరక్షన్ లో వచ్చే ప్రతి సినిమాలో హీరోయిన్ పేరు ప్రియ అని పెడతాడు. ఆ సెంటిమెంట్ ను గ్యాంగ్ లీడర్ సినిమాకు కొనసాగించాడు విక్రం కె కుమార్. సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రియాంకా అరుల్ మోహన్ పాత్ర పేరు ప్రియా అని పెట్టాడు. అయితే తన ప్రతి సినిమాలో హీరోయిన్ పాత్ర పేరు ప్రియ అని ఎందుకు పెడుతున్నాడో తనకు తెలియదని అన్నాడు నాని. 


అయితే ఆ సీక్రెట్ ఏంటన్నది గ్యాంగ్ లీడర్ హీరోయిన్ ప్రియాంకాకు తెలుసట. ఆ విషయాన్ని ఆమె చెప్పడం జరిగింది. అయితే దాన్ని మాత్రం బయటకు చెప్పనని అన్నది ప్రియాంకా. విక్రం కుమార్ భార్య పేరు కూడా ప్రియ కాదు కాని ఆ పేరునే తన ప్రతి సినిమాలో హీరోయిన్ పేరుగా పెడుతుంటాడు విక్రం. అయితే విక్రం మాత్రం ప్రియ అందమైన పేరని సౌండింగ్ కూడా బాగుంటుందని అన్నాడు విక్రం.


ఈ ఇయర్ జెర్సీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాని గ్యాంగ్ లీడర్ తో మరో హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో పాటుగా నాని ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో వి సినిమా చేస్తున్నాడు. అయితే ఆ సినిమాలో నాని విలన్ గా చేస్తుండటం విశేషం. సినిమాలో సుధీర్ బాబు కూడా నటిస్తున్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: