బిగ్ బాస్ సీజన్ 3 తెలుగులో రోజుకో ట్విస్ట్ ఇస్తున్నాడు బిగ్ బాస్. 8వ వారం వచ్చేసరికి బిగ్ బాస్ మరింత టైట్ చేస్తున్నాడు. ఇప్పటికే హౌజ్ లో స్ట్రాంగ్ గా ఉన్న కంటెస్టంట్స్ ను నామినేట్ చేస్తుండగా లాస్ట్ వీక్ అలి రెజా ఎలిమినేషన్ అందరికి షాక్ ఇచ్చింది. ఇక బిగ్ బాస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే సడెన్ గా ఏమైందో ఏమో కాని బిగ్ బాస్ నుండి మహేష్ సూట్ కేస్ సర్ధుకుని బయటకు వచ్చేశాడు.


మాములుగా అయితే శని, ఆదివారాల్లో ఉండాల్సిన ఎలిమినేషన్ ఇలా వారం మధ్యలో ఉండటం పట్ల ఇంటి సభ్యులు షాక్ అవుతున్నారు. అయితే మహేష్ నిజంగానే ఎలిమినేట్ అయ్యాడా లేక బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ రూపంలో బయటకు వస్తున్నాడా అన్నది ఈరోజు తెలుస్తుంది. మొత్తానికి ఆడియెన్స్ కు ఎక్సైటింగ్ కలిగించేలా బిగ్ బాస్ భలే ప్లాన్ చేశాడు.


నిజంగానే మహేష్ వారం మధ్యలో బయటకు వస్తే మాత్రం అతనికి సంబందించిన విషయంలో ఏదో ఎమర్జెన్సీ అయ్యుండొచ్చని అంటున్నారు. మొత్తానికి బిగ్ బాస్ శుక్రవారం ట్విస్ట్ మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు. మహేష్ ఈ వారం నామినేషన్స్ లో ఉన్నాడు. అయితే అతనికి ఒకవేళ సీక్రెట్ టాస్ ఇస్తే కనుక అతను ఈ వారం సేఫ్ అయినట్టే లెక్క.


ఇక మిగిలిన వారిలో శిల్పా చక్రవర్తి, పునర్నవిల ఇద్దరిలో ఎలిమినేషన్ ఉండొచ్చని టాక్. అయితే ఈ వారం జరిగిన బిగ్ బాస్ స్పెషల్ టాస్క్ లో పునర్నవి చేసిన ఓవరాక్షన్ ఆడియెన్స్ కు కోపం తెప్పించింది. దాదాపుగా పునర్నవినే ఈ వారం ఎలిమినేట్ అవుతుందని అంటున్నారు. శని, ఆదివారాల్లో నాగార్జున హంగామా ఎలాగు ఉంటుంది. మరి ఈ వారం నాగ్ ఎవరిని ఎలిమినేట్ చేస్తాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: