విద్యుల్లేఖ రామన్ గురించి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. కామెడి గాబా ట్రై చేస్తోంది. పెద్ద సినిమాలైతే చేస్తోంది గాని కోవై సరళ రేంజ్ లో మాత్రం కామెడి పండించలేకపోతోంది. కుప్పలు కుప్పలుగా సినిమాలు చేస్తున్నాగాని అందులో గుర్తుండిపోతున్న సినిమాలు, క్యారెక్టర్లు కొన్ని మాత్రమే. లాయర్ల కుటుంబం నుంచి వచ్చిన  విద్యుల్లేఖ రామన్... ఫ్యామిలీలో ఎక్కువమంది న్యాయశాస్త్రంలో పట్టాలు పుచ్చుకుని లాయర్లు అవగా.. తను మాత్రం నటనలో శిక్షణ తీసుకుని నటి అయ్యారు. తెలుగు-తమిళ పరిశ్రమల్లో విద్యుల్లేఖ కమెడియన్ గా కాస్త పేమస్ అయింది. ఏదో రకంగా తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ ని తెచ్చుకొని తన చేతలు.. చేష్టలతో ఫ్యాన్స్ కి ఈజీగా నవ్వు తెప్పిస్తోంది.   

అలా కనెక్టవ్వడంతో తనకంటూ కొద్దిగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే ఇటీవల తెలుగులో కామెడీ సినిమాల దర్శకులు తగ్గి.. పూర్తి స్థాయి కామెడీ సినిమాలు లేకపోవడంతో ఆ ప్రభావం విద్యుల్లేఖ మీద బాగానే పడింది. దాంతో అవకాశాలు తగ్గాయి. ఇక ఈ మధ్యకాలంలో విద్యుల్లేఖ కెరీర్ కాస్త డైలమాలోనే ఉంది. ఆ క్రమంలోనే ఇలా కొత్త ప్రయత్నం చేస్తున్నట్టే కనిపిస్తోంది. లావు పాటి దేహశిరుల్లో మార్పు కోరుతూ నిరంతరం జిమ్ముల్లో బాగానే శ్రమిస్తోందని ఇన్ స్టా ఫోటోలు చూస్తే తెలుస్తోంది. వ్యాయామానికి తగ్గట్టే ఫలితం కూడా తన రూపంలో కనిపిస్తోంది. 

ఇప్పుడు పూర్తిగా సన్నబడింది. ఇంతకుముందుతో పోలిస్తే చాలా స్లిమ్ గా మారిపోయింది. అయితే మారిన ఈ రూపం చూశాక ఇంతకుముందు అవకాశాలిచ్చిన వాళ్లు అయినా ఇస్తారా? అన్నది సందేహమే. ప్రస్తుత రూపానికి తగ్గట్టు తనకు ఆఫర్ చేసే పాత్రల తీరు మారాల్సి ఉంటుంది. ఇంతకుముందులా కామెడీ వెంటనే వర్కవుట్ కాకపోవచ్చు. చూడగానే నవ్వు కూడా రాకపోవచ్చు. అయితే తనెందుకు సన్నబడాలనుకుందో, కామెడీ వదిలేసి అందరిలా హీరోయిన్ అయిపోదామనుకుందా అన్న విషయం విద్యుల్లేఖ చెప్తేనే తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: