తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న హీరో సూర్య. 2005లో వచ్చిన గజినీ సినిమాతో తెలుగులోనూ పాపులర్ అయ్యాడు. ఆ సినిమాలో సూర్య నటించాడు అనేకంటే జీవించాడు అనాల్సిందే.  అప్పటి నుంచీ సూర్యకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. సూర్య ప్రతి సినిమా తమిళ్ తో పాటు తెలుగులోనూ విడుదల అవుతోంది. ప్రస్తుతం బందోబస్త్ అనే మూవీ తమిళ్ తోపాటు తెలుగులోనూ విడుదల కానుంది. 

 

 

ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. 'దేశ భద్రత, సైనికుల కర్తవ్యం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా తెలిసింది. డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయడం సంతోషంగా ఉంది. ఆర్య షూటింగ్ స్పాట్ లో ఉండగా సయేషా సైగల్ తో నటించడం ఇబ్బందిగా అనిపించింది. కేవీ ఆనంద్ అద్భుతమైన టేకింగ్ సినిమాకు బలం.' అని చెప్పుకొచ్చాడు. ఆర్య పాత్రను అల్లు శిరీష్ చేయాల్సింది. కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఆర్యను ఈ పాత్రకి తీసుకోవాల్సి వచ్చిందన్నాడు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టీ తో నటించడం తన అదృష్టమన్నాడు. కెమెరా ఆన్ అయితే పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసే తీరు అందరికీ ఆదర్శమని చెప్పుకొచ్చాడు. తెలుగు సినిమాల గురించి మాట్లాడుతూ.. 'మెగాస్టార్ చిరంజీవికి అభిమానినని, సైరా.. సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు తెలిపాడు. చరణ్ ఈ సినిమా నిర్మాణం కోసం పడిన కష్టం తెలుసుకుని ఆశ్చర్యపోయానన్నాడు. తెలుగులో మంచి కాన్సెప్ట్స్ తో సినిమాలు వస్తున్నాయని అన్నాడు. 

 

 

తమిళ్ లో మంచి సినిమాటోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న కేవీ ఆనంద్ గతంలో రంగం, బ్రదర్స్ సినిమాలు చేశాడు. స్వతహాగా ఫోటో జర్నలిస్ట్ గా పని చేయడంతో ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తున్నాడు. ఈనెల 20న ఈ సినిమా విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: