తమిళ సినిమా ఇండస్ట్రీలో దాదాపు ఉన్న అందరు హీరోలు ఎక్కువగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్స్ నే చేస్తుంటారు. అందులో ఎక్కువగా విశాల్ సినిమాలే ఉండటం మన అందరికి తెలిసిందే. అందులో భాగంగానే యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన ఈ కొలీవుడ్ హీరో విశాల్ మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రీసెంట్ గా 'టెంపర్' సినిమా రీమేక్ తో తమిళ ప్రేక్షకులను మెప్పించిన విశాల్ తాజాగా 'యాక్షన్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగులో కూడా అదే టైటిల్ తో రిలీజ్ చేయబోతున్నారు.  యాక్షన్ సినిమాల హీరోకు ఇంత కంటే పవర్‌ఫుల్ టైటిల్ వేరే దొరకడం కష్టం. 

13 సాయంత్రం 5 గంటలకు 'యాక్షన్' సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఒక టీజర్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇక ఈ సినిమా టీజర్ కంప్లీట్ మాస్ యాక్షన్ షాట్స్ తో కట్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే విషాల్ విశ్వరూపం మరోసారి చూపించబోతున్నాడని అర్థమవుతోంది. గత కొంతకాలంగా విశాల్ వరుస హిట్స్ తో మాంచి దూకుడు మీద ఉన్నాడు. విశాల్ సరసన ఈ సినిమాలో తమన్నా భాటియా నటించింది. తమన్నాకి కూడా ఈ సినిమా మంచి కమర్షియల్ హిట్ ఖాయమని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో విశాల్ ఒక మిలిటరీ కమాండో పాత్రలో నటిస్తున్నాడని కోలీవుడ్ మీడియా సమాచారం.  యోగిబాబు.. కబీర్ దుహాన్ సింగ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. హిప్ హాప్ తమిళ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ను ట్రైడెంట్ ఆర్ట్స్ బ్యానర్ పై ఆర్. రవీంద్రన్ నిర్మిస్తున్నారు. ఇక డైరెక్టర్ సుందర్.సి మరో హిట్ ని తన ఖాతాలో వేసుకోబోతున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: