దాదాపు 12 ఏళ్ళుగా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ వస్తున్న కాజల్ మెగాస్టార్ 150 మూవీ ఖైదీ నంబర్ 150 లో చిరుకి జోడిగా నటించింది. ఇక కాజల్ కు ఈ మధ్య కాలంలో కాస్త అవకాశాలు తగ్గాయి. స్టార్స్ కు జోడీగా నటించే అవకాశాలు వస్తున్నా కూడా ఆశించిన స్థాయిలో కాజల్ సినిమాల సంఖ్య ఉండటం లేదు. ప్రస్తుతం తెలుగులో కాజల్ చేస్తున్న సినిమాలు ఏమీ లేవు. తమిళంలో మాత్రం కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్ లో వస్తున్నా 'ఇండియన్ 2' సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాతో పాటు బాలీవుడ్ లో ఒక సినిమాలోనూ నటిస్తోంది.  ఇదిలా ఉంటే కాజల్ మొదటి సారి ఒక వెబ్ సిరీస్ లో నటించేందుకు సైన్ చేసిందని లేటెస్ట్ న్యూస్.

ప్రస్తుతం టాలీవుడ్.. కోలీవుడ్.. బాలీవుడ్ ఇలా అన్ని పరిశ్రమలకు చెందిన ప్రముఖులు కూడా వెబ్ సిరీస్ ను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కియారా అద్వాని, సమంత, జగపతి బాబు, రమ్యకృష్ణ లాంటి వాళ్ళు ఈ వెబ్ సిరీస్ లో ఇప్పటికే నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళతో పాటు కాజల్ కూడా ఒక వెబ్ సిరీస్ లో కీలక పాత్రను పోషించేందుకు సిద్దం అయ్యింది. తమిళ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ఈ శుక్రవారం నుండి కాజల్ ఈ వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొంటోంది. ఈ విషయాన్ని యూనిట్ సభ్యులు వెళ్లడించారు.

కాజల్ కు తెలుగుతో పాటు తమిళంలోను హీరోయిన్ గా మంచి పాపులారిటి ఉంది. అందుకే తమిళంలో కాజల్ వెబ్ సిరీస్ చేసేందుకు సిద్దం అయ్యింది. హాట్ స్టార్ ఈ సిరీస్ ను ప్రసారం చేయబోతుంది. తమిళంలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ ను హాట్ స్టార్ తెలుగులో డబ్ చేసి వదులుతారని తెలుస్తోంది. నటిగా అవకాశాలు తగ్గడంతో నిర్మాతగా మారాలని కాజల్ మరో పక్క సన్నాహాలు మొదలు పెట్టింది. సినిమాలను వెబ్ సిరీస్ లను లో బడ్జెట్ లో నిర్మించేందుకు ఆమె ఒక టీంను తయారు చేసుకుందని గత కొంతకాలంగా న్యూస్ స్ప్రెడ్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ టీం ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టినట్లుగా సమాచారం. మొత్తానికి కాజల్ ప్లాన్స్ బాగానే ఉన్నాయి. నిర్మాతగా సక్సస్ అయితే మాత్రం కాజల్ చాలామందికి ఉపాది కల్పిస్తుందని దీన్ని బట్టి అర్థమవుతోంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: