ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి అత్యద్భుత విజయాలు అందుకున్న బాహుబలి రెండు భాగాల తరువాత, ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఇప్పటివరకు అఫీషియల్ టైటిల్ నిర్ణయం కాని ఈ భారీ మల్టీస్టారర్ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై భారీ ఖర్చుతో నిర్మితం అవుతున్న ఈ సినిమాకు దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

ప్రస్తుతం బల్గెరియా దేశంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న విషయం తెలిసిందే. అయితే నేడు ఈ సినిమా విషయమై ఒక నెగటివ్ వార్తను కొందరు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ వైరల్ చేస్తున్నారు. అదేమిటంటే, ఈ సినిమా ఫుల్ లెంగ్త్ భారీ యాక్షన్ సినిమా అని, ఇక సినిమాలో ఫైట్స్, ఛేజింగ్, యాక్షన్ సన్నివేశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, థియేటర్ కు వచ్చే ప్రేక్షకుడికి ఎంటర్టైన్మెంట్ ని అందించే కామెడీ సన్నివేశాలు మాత్రం లేనే లేవని అంటున్నారు. ఇది ఒకరకంగా రేపు రిలీజ్ తరువాత సినిమాకు కొంత మేర దెబ్బ తీసే అంశం అవుతుందంటూ వార్తలు ప్రచారం చేస్తున్నారు. 

అయితే ఈ విషయమై కొందరు సినీ విశ్లేషకులు స్పందిస్తూ, నిజానికి ఇటీవల రిలీజ్ అయి, భారీ విజయాలు అందుకున్న బాహుబలి రెండు భాగాలు, కెజిఎఫ్, దంగల్ వంటి సినిమాల్లో కామెడీ అనేది ప్రత్యేకంగా లేదనే విషయం మరిచిపోకూడదని, నిజానికి ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీనే అని ఎక్కువ మంది భావిస్తుంటారు, కానీ థియేటర్ కు వచ్చే ప్రేక్షకుడికి, ఆ సినిమాలోని ఆకట్టుకునే కథ మరియు కథనాలే నిజమైన ఎంటర్టైన్మెంట్ అని వారు అంటున్నారు. కాబట్టి ప్రస్తుతం కొందరు పనిగట్టుకుని ఆర్ఆర్ఆర్ పై ప్రచారం చేస్తున్న ఈ తప్పుడు వార్తలను లక్ష్య పెట్టవలసిన అవసరం లేదని వారు అభిప్రాయపడుతున్నారు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: