సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. రొమాంటిక్ లవ్ స్టోరీస్ కి..ప్లేబాయ్ పాత్రలకు అక్కినేని హీరోలు తప్ప మరెవరు సూటవరు అన్నంతగా ఆ క్యారెక్టర్స్ లో లీనమయి నటిస్తారు. లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు ఇటువంటి పాత్రలకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఆయన అందించిన వారసత్వాన్ని తనదైన శైలితో నాగార్జున దశాబ్ధాలుగా కొనసాగుతున్నారు. దాన్ని నాగ్ వారసులైన నాగచైతన్య - అఖిల్ మరో స్థాయికి తీసుకెళ్లాలని చాలా కాలంగా తపిన్నారు. అయితే వాళ్ళ తపనని ఇంతకుముందు వచ్చిన 'భాయ్'..'రగడ'..రీసెంట్ గా వచ్చిన 'మన్మథుడు-2' సర్వ నాశనం చేశాయి. రొమాంటిక్ ప్లే బాయ్ పాత్రలంటేనే అక్కినేని హీరోలు భయంతో చమటలు పట్టేలా చేశాయి. 

లేటు వయసులో నాగార్జున ప్లేబాయ్ గా నటించిన మన్మథుడు-2 ఊహించని విధంగా నాగ్ కి షాక్ ఇచ్చిన విషయం తెలిసిదే. దీంతో ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీ షాక్ లో వుంది. నాగచైతన్య ను ఈ సినిమా రిజల్ట్ మరింత భయాందోళనకు గురిచేస్తోందట. దీంతో ఇలాంటి పాత్రలో నటించాలంటే వెనకాడుతున్నాడట. చైతూ త్వరలో సోగ్గాడే చిన్ని నాయనకి సీక్వెల్ గా వస్తున్న బంగార్రాజులో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ప్లేబోయ్ గా చేయాల్సి ఉండగా అందులో నటించడానికి చైతూ భయపడుతున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. అందుకే పాత్రని కంప్లీట్ గా మార్చమని దర్శక, రచయితలకు సూచించారట .

ఇక అఖిల్ కూడా మిస్టర్ మజ్నులో ప్లే బాయ్ క్యారెక్టర్ చేయడం.. దాన్ని ప్రేక్షకులు రిజెక్ట్ చేయడం.. ఆ వెంటనే నాగ్ చేసిన మన్మథుడు-2ని దారుణంగా రిజెక్ట్ చేయడం చూసిన చైతన్య ప్లే బాయ్ క్యారెక్టర్ అంటేనే డౌట్ పడుతున్నాడట. ఈ నేపథ్యంలో కల్యాణ్ కృష్ణ చైతూ కోసం ఆ క్యారెక్టర్ వరకూ మారుస్తాడా? లేక అదే కంటిన్యూ చేసి అక్కినేని ఫ్యామిలీ కి సక్సెస్ చూపిస్తాడా? అన్నది బంగార్రాజు తో తెలిసిపోతుంది. అయితే నటవారసుల్లో దానిని బయటకు తీయగలిగేది దర్శకులు మాత్రమే. త్వరలోనే బంగార్రాజు సెట్స్ పైకి వెళ్లనున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి ప్రతిదీ అక్కినేని ఫ్యాన్స్ ని కంగారు పెడుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: