శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో వరుణ్, శ్రీముఖిల మధ్య జరిగిన ఇష్యూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరిద్దరి మధ్య ఇంతవరకు ఎలాంటి ఇష్యూ జరగలేదు. బిగ్ బాస్ లో శ్రీముఖి మొదటి నుండి తన వాదనని గట్టిగా వినిపిస్తుంది. తన వాదన ద్వారా అవతలి వారిని ఇన్ ఫ్ల్యూయెన్స్ చేస్తుంది. శుక్రవారం జరిగిన టాస్క్ లో కూడా ఆమె అలాంటి ప్రయత్నమే చేసింది. దాంతో వరుణ్ ఆమె డెసిషన్స్ నువ్వే తీసుకుంటున్నావంటూ సీరియస్ అయ్యాడు. కానీ ఆ విషయాన్ని అతను సరిగ్గా చెప్పలేకపోయాడు.


ఎంతసేపూ నువ్వు బొక్క పడింది అన్నావని చెప్తున్నాడే గానీ, ఇన్ ఫ్ల్యూయెన్స్ చేస్తున్నావు. అది కరెక్ట్ కాదని చెప్పలేకపోయాడు. తన వాదనలో స్పష్టత లోపించడంతో అతనేం చెప్తున్నాడో సరిగ్గా అర్థం కాలేదు. బొక్క పడింది అనే ఒక మాటని పట్టుకున్నాడు తప్పితే ఆమె చేసిన తప్పును సరిగ్గా ఎత్తి చూపలేకపోయాడు. ఇక ఇక్కడ శ్రీముఖి చేసింది కూడా తప్పు కాదు. ఇన్ ఫ్ల్యూయెన్స్ చేయడం ఆమె గేమ్ ప్లాన్ లో ఒక భాగమై ఉండవచ్చు. అదీ గాక ఆమె మాటలు విని ఇన్ ఫ్ల్యూయెన్స్ అయిన వాళ్ళని అనాలి. వాళ్లకి ఆలోచించే తెలివి ఉంటుంది. శ్రీముఖి తన మాట వినాలని పట్టు పట్టడం లేదు. 


కేవలం తన మాటని అందరికీ చేరేలా చేస్తుంది. అలా ఎవరైనా చేయవచ్చు. ఇంకో విషయం ఏంటంటే శుక్రవారం టాస్క్ లో రాహుల్ విషయంలో ఆమె గెస్ తప్పు అయింది కాబట్టి వరుణ్ అంతలా మాట్లాడాడు. ఒకవేళ ఆమె గెస్ చేసింది నిజం అయితే ఊరుకునేవాడేమో!  ఇక్కడే వరుణ్ తప్పు చేశాడు. అతను నిజంగా శ్రీముఖి ఇతరులని ప్రభావం చేస్తుందని ఫీల్ అయితే అంతకుముందే చెప్పి ఉండాల్సింది. తప్పు జరిగాక చెప్పడం కంటే, జరుగుతున్నప్పుడే అందరి దృష్టికి తీసుకెళ్తే బాగుండేది.   



మరింత సమాచారం తెలుసుకోండి: