పవన్‌ కళ్యాణ్‌ ను సినిమాలలో నటింపచేయాలి అన్నప్రయత్నాలు గతకొద్ది రోజులుగా జరుగుతున్నా  ఇప్పుడు ఆప్రయత్నాలకు త్రివిక్రమ్ సహాయం తోడైంది అన్న వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు దిల్ రాజ్ తాను నిర్మించబోయే ‘పింక్’ రీమేక్ లో పవన్ ను నటింప చేసే బాధ్యతలు దిల్ రాజ్ త్రివిక్రమ్ అప్పచెప్పినట్లు తెలుస్తోంది. 

‘పింక్’ మూవీ బాలీవుడ్ లోనే కాకుండా అజిత్ నటించిన తమిళ రీమేక్ కూడ సక్సస్ కావడంతో   ఆమూవీ రీమేక్ హక్కులను దిల్ రాజ్ తీసుకున్నాడు. మొదట్లో ఈమూవీని బాలకృష్ణతో దిల్ రాజ్ చేయాలని ప్రయత్నించినా ఆ ప్రయత్నాలకు బాలయ్య సహకారం లభించలేదు. దీనితో ఇప్పుడు దిల్ రాజ్ దృష్టి పవన్ పై పడి అతడిని ఈరీమేక్ లో నటించమని తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. 

అయితే ఈ విషయంలో దిల్ రాజ్ చేస్తున్న రాయ బారాలకు పవన్ స్పందించక పోవడంతో పవన్‌ కి ఆప్తమిత్రుడైన త్రివిక్రమ్‌ ను ఈ విషయంలో దిల్ రాజ్ దూత నియమించినట్లు తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఇటీవల త్రివిక్రమ్ పవన్‌ ని కలిసి ‘పింక్‌’ రీమేక్‌ గురించి చాలాసేపు చర్చించాడట. అయితే ఇందులో త్రివిక్రమ్‌ కి కూడ లాభం ఉంది అంటూ గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. ఈసినిమా విషయంలో త్రివిక్రమ్ పవన్ ను ఒప్పించగలిగితే ఈమూవీ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం ఇస్తానని దిల్ రాజ్ త్రివిక్రమ్ కు ఆఫర్ చేసినట్లు టాక్. 

ఈ ఆఫర్ కు ఆకర్షితుడైన త్రివిక్రమ్ రంగంలోకి దిగడంతో పవన్ ఈమూవీకి ఒప్పుకుంటాడా అంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలు విని పవన్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ‘పింక్’ కథ మాస్ ప్రేక్షకులకు నచ్చే కథ కాదని పవన్ నటించబోయే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలి అని తామంతా కోరుకుంటూ ఉంటే కొన్ని వర్గాల ప్రేక్షకులకు మాత్రమే నచ్చే కథలో పవన్ నటిస్తే మరొకసారి రాంగ్ డెసిషన్ అవుతుందని ‘అజ్ఞాతవాసి’ తో ప్రయోగాలు చేసి పవన్ కు సినిమా లపై విరక్తి కలిగించిన త్రివిక్రమ్ కాంబినేషన్ తిరిగి సెట్ అవ్వకుండా ఉంటే బాగుండును అని పవన్ అభిమానులు కోరుకుంటున్నట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: