షారుక్ కెరీర్లో బెస్ట్ సినిమాల్లో ఒకటి దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే... ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. లండన్ నుంచి యూరప్ టూర్ కు బయలుదేరిన షారుక్.. అదే ట్రైన్ లో కాజోల్ పరిచయం అవుతుంది.  అక్కడి నుంచి వాళ్ళ జర్నీ లుక్స్ తో మొదలయ్యి. పోట్లాడుకునే వెళ్లి.. ప్రేమగా మారి.. ఒకరిని వదిలి మరొకరు ఉండలేనంతగా మారిపోతుంది.  అయితే, లండన్ లో నైట్ టైమ్ షాప్ క్లోస్ చేసే సమయంలోఅక్రమంగా చొరబడి బీర్ బాటిల్స్ తీసుకొని డబ్బులు విసిరేసి వెళ్లిన షారుక్ అంటే కాజోల్ తండ్రి ఆమ్రేష్ పురికి నచ్చదు.  


కాజోల్ ఇండియాకు తిరిగి వస్తుంది.  తండ్రి సంబంధం చూస్తాడు.  పెళ్లి హడావుడి మొదలౌతుంది.  షారుక్ ఆ అమ్మాయి కోసం ఇండియా వస్తాడు.  ఇండియా వచ్చిన షారుక్ కాజోల్ కోసం ఓ సాంగ్ పాడతాడు.. అదే తుఝే దేఖాతోయి సాంగ్.  ఈ సాంగ్ అప్పట్లో సూపర్ హిట్.  సినిమా బంపర్ హిట్.  ముంబైలోని ఓ థియేటర్లో ఎన్ని సంవత్సరాలు ఆడింది.  ఈ సినిమా తెలుగులో ప్రేమించి పెళ్లాడుతా అనే పేరుతో డబ్బింగ్ కాగా, తెలుగులో కూడా సూపర్ హిట్టైంది.  డబ్బింగ్ సినిమాలకు ఈ స్థాయిలో పేరు రావడం అదే మొదటిసారి కావొచ్చు.  


ఇదిలా ఉంటె, ఈ సినిమాలోని తుఝే దేఖా తోయి సాంగ్ ను కెన్యాలోని ఓ ఇద్దరు నటీనటులు నర్తించారు. షారుక్, కాజోల్ ఎలాగైతే ఎక్స్ ప్రెషన్ తో ఆకట్టుకున్నారో.. దాదాపు అలానే ఈ ఇద్దరు ఆకట్టుకున్నారు.  ఇది సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది.  క్షణాల్లో వైరల్ అయ్యింది. ఈ చిన్న బిట్ సాంగ్ ను అనుపమ్ ఖేర్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేయగా దాదాపు లక్షమందికి పైగా వీడియోను చూశారు.  వేలాదిమంది లైక్ చేస్తున్నారు.  కామెంట్స్ చేస్తున్నారు.  సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత సినిమా రంగానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.  


ఒక్క హాలీవుడ్ సినిమాలే కాదు.. బాలీవుడ్ సినిమాలు కూడా ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాయి.  సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత అక్కడ మన సాంగ్స్ ఎంత వరకు ఎలా పాపులర్ అయ్యాయో అర్ధం అవుతున్నది.  ఈ ఒక్క పాటే కాదు షారుక్ సినిమాలోని చాలా పాటలకు ఆఫ్రికా దేశాల్లో ఫ్యాన్స్ ఉన్నారు.  వారి భాషల్లో తర్జుమా చేసుకొని వింటూ ఎంజాయ్ చేస్తున్నారు.  కెన్యా, నైజీరియా, ఘనా వంటి దేశాల్లో ఫ్యాన్స్ ఎక్కువగా ఉండటం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: