బిగ్ బాస్ సీజన్ 3 లో  ఈ వారంలో  జరిగిన లక్సరీ బడ్జెట్ టాస్క్ లో పునర్నవి బిగ్ బాస్ పై ఫైర్ అవ్వడంతో ఆ టాస్క్ ను పూర్తిగా రద్దు చేసాడు బిగ్ బాస్. ఆ తరువాత ఆ టాస్క్ లో వరెస్ట్ పెర్ఫార్మర్స్ గా శ్రీముఖి, మహేష్, మరియు  పునర్నవి లని బిగ్ బాస్ ఎంపిక చేసాడు.  టాస్క్ గురించి మీ రహస్యాలను వేరేవాళ్లతో చెప్పొద్దూ అని చెప్పినా కానీ,వాటిని దృష్టిలో పెట్టుకోకుండా ప్రవర్తించారు అంటూ వీరికి మరో స్పెషల్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా బిగ్ బాస్ వారికి షూస్ పాలిష్ చేసే టాస్క్ ఇచ్చాడు. ఇక పునర్నవి నేను బయటకు వెళ్లడానికైనా సిద్ధమే కానీ ఇలాంటివి చేయను,మీకు మైండ్ ఉందా ఇలాంటి టాస్క్ లను ఇస్తున్నారంటూ బిగ్ బాస్ పై మండిపడింది దానికి బిగ్ బాస్ ఈ టాస్క్ ను చేయని వారిని నేరుగా వచ్చే వారం నామినేట్ చేయబడుతుంది అని చెప్పాడు. 

ఇక పొతే  ఇక ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న టెన్షన్ హౌస్లో అందరికి మొదలైంది.  ఇప్పటివరకు హౌస్ నుంచి ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. ఈ సీజన్ బిగ్ బాస్ కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంతగా  కలిసి వచ్చినట్టు లేదు. ఫస్ట్  వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా వచ్చినట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి రెండో వారానికే ఎలిమినేట్ అయ్యి బయటకి వెళ్ళిపోయింది.  ఇక ఇప్పుడు రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తీసుకొచ్చిన శిల్పా చక్రవర్తి కూడా ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు. 

ఇప్పటివరకు హౌస్ నుంచి ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. హేమ, టీవీ 9 జాఫర్ , తమన్నా సింహాద్రి , రోహిణి , అషు రెడ్డి , అలీ బయటికి వెళ్లారు. ఈ వారం ఎలిమినేషన్ కి  ఐదుగురు బిగ్ బాస్ ఇంటి సభ్యులు   నామినేట్ అయ్యారు. రవి కృష్ణ కూడా ఎలిమినేషన్ అయినా కెప్టెన్ హోదాలో బాబా భాస్కర్ కు ఒకరిని సేవ్ చేసే ఛాన్స్ రావడంతో రవిని సేవ్ చేశాడు. ఇక ఇప్పుడు ఎలిమినేషన్ జోన్లో శిల్పా చక్రవర్తి , పునర్నవి, హిమజ , శ్రీముఖి , మహేష్ విట్టా ఉన్నారు. వీరిలో బయట ఉన్న  ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా చూస్తే శ్రీముఖి  హిమజ బాగా సేఫ్ జోన్ లో ఉన్నట్టే అని చెప్పవచ్చు. మహేష్ విట్టా , పునర్నవి కంటే శిల్పా చక్రవర్తి తన వీక్  పెర్పామెన్స్ తో అందరికి షాక్ ఇస్తున్నారు.

ఇక హౌస్ లో కూడా ఎక్కువ మంది ఆమెకు యాంటీగా మారిపోయారు. ఈ వారం ఆమె నామినేషన్ కు ఎంపిక కావడానికి ఇది కూడా ఓ ప్రధాన కారణం. ఇక బయట కూడా ఆమెకు ఎక్కువ మంది ఓట్లు వేసేందుకు ఇష్టపడడం లేదని తెలుస్తోంది. సోషల్ మీడియా ట్రెండింగ్ కూడా శిల్పానే ఎలిమినేట్ అవుతుందంటోంది.   కానీ ఈ వారం ఒక పెద్ద ట్విస్ట్ వుండబోతుందనే వరహాలు కూడా వస్తున్నాయి. అదేమిటంటే ఈ వారం బిగ్ బాస్ హౌస్లో డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది అని తెలుస్తుంది. ఈ వారం పునర్నవి , శిల్పలు ఎలిమినేట్ అయ్యి బయటకి రాబోతున్నారని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: