వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరక్కిన చిత్రం "వాల్మీకి". ఈ సినిమా సెప్టెంబరు ౨౦ వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను తమిళంలో విజయం సాధించిన "జిగర్తాండ" కి రీమేక్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో వరుణ్ తేజ్ పాత్ర చాలా కొత్తగా ఉండబోతుందని సమాచారం. ఇప్పటికే టీజర్, ట్రైలర్ లో వరుణ్ లుక్ చూసి సినిమా తప్పక విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు.


ఇక ఆశ్చర్యం గొలిపే విషయం ఏంటంటే వరుణ్ తేజ్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించడం. జిగర్తాండ సినిమాలో విలన్ గా నటించిన బాబీ సింహాకి జాతీయ అవార్డు వచ్చింది. అంటే ఈ సినిమాలో విలన్ పాత్ర ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. అలాంటి పాత్రలో వరుణ్ తేజ్ నటించడం సాహసమనే చెప్పాలి. ట్రైలర్ లో వరుణ్ చెప్పే డైలాగులు, మ్యానరిజం చాల బాగున్నాయి.


అలాగే సినిమాలో పాటలు మరో హైలైట్ అని చెప్పవచ్చు. ఇప్పటి వరకు రిలీజైన మూడు పాటలు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచాయి. మిక్కీ జె మేయర్ ఈ సినిమాకి విభిన్నమైన సంగీతం అందించారు. రిలీజైన మూడు పాటలని చూస్తే మిక్కీ గత సినిమాలతో ఏమాత్రం సంబంధం లేకుండా చాలా కొత్తగా చేశాడు. మెలొడీ పాటలని అద్భుతంగా స్వరపరిచే మిక్కీ చేత మాస్ సాంగ్స్ చేయించడం దర్శకుడు హరీష్ శంకర్ కే చెల్లింది.


ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ వేడుకను ఈ నెల 15న హైదరాబాద్ నగరంలో జరపనున్నారు. ఈ వేడుకకు విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. వరుణ్ తేజ్, వెంకటేష్ గతంలో ‘ఎఫ్ 2’ అనే సూపర్ హిట్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.పూజా హెగ్డే కథానాయకిగా నటించిన ఈ చిత్రంలో అధర్వ మురళి ఒక కీలక పాత్రలో నటించడం జరిగింది. ఇకపోతే ఈ సినిమాను 14 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా నిర్మించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: