మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా , గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం వాల్మీకి.  ఈ చిత్రం సెప్టెంబర్ 20న విడుదల కానుంది. తమిళంలో విజయవంతమైన జిగర్తాండ సినిమాకి రీమేక్ గా వాల్మీకి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన స్టార్ హీరోయిన్  పూజా హెగ్డే  , ముకుంద తరువాత మరోసారి జోడిగా కనిపించనుంది.  తమిళ నటుడు అథర్వా మురళి విలన్‌గా కనిపించనున్నాడు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు.

ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని ..రిలీజ్ సిద్ధంగా ఉంది. దీనితో రోజుకో పోస్టర్ సాంగ్స్ తో అందరిని ఆకట్టుకుంటూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తుంది. తాజాగా  ఈ సినిమాలో ని   వక వక లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. దడ దడ దడ దంచుడే.. గుండెల్లోకి పిడి దించుడే.. అడ్డమొచ్చినోడ్ని సంపుడే అంటూ తెలంగాణ పదజాలంతో ఉన్న  ఈ పాట అందరిని ఆకట్టుకుంటోంది. అలాగే ఈ సినిమా నుండి వచ్చిన ట్రైలర్స్ , టీజర్స్ పోస్టర్స్ అన్ని కూడా అభిమానులని అరరించడంతో సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. 

ఇకపోతే  ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 15వ తేదీన హైదరాబాదులోని శిల్పకలావేదికలో జరగబోతుంది. ఈ చిత్రానికి హీరో వెంకటేశ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. వెంకీ, వరుణ్ ల కాంబినేషన్లో వచ్చిన ఎఫ్ 2 చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, వరుణ్ చిత్రానికి వెంకటేశ్ తన వంతుగా ప్రమోషన్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా టైటిల్ పై ఇప్పటికే హై కోర్ట్ లో కేసులో నడుస్తుంది. దీనితో సినిమా రిలీజ్ కి ఏ సమస్య వస్తుందో అని చిత్ర యూనిట్ కూడా టెంక్షన్ లో ఉంది. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: