భారీ అంచనాల మధ్య  నిన్న విడుదలై  సూపర్ పాజిటివ్ రివ్యూస్ ను రాబట్టి  మొదటి రోజు  బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది హిందీ చిత్రం  డ్రీం గర్ల్.  బాలీవుడ్ యంగ్ హీరో  ఆయుష్మాన్ ఖురానా , నుశరత్ బరుచా జంటగా నటించిన ఈచిత్రం  బ్లాక్ బాస్టర్ టాక్ తో మొదటి రోజు 10.5 కోట్ల షేర్ ను  రాబట్టి అదరగొట్టింది.  ఆయుష్మాన్ కెరీర్ లో ఇదే హైయెస్ట్ ఓపెనింగ్ కావడం విశేషం.  రొమాంటిక్ కామెడీ  ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి  ప్రేక్షకులనుండి అద్భుతమైన  స్పందన వస్తుంది. ప్రస్తుతం  బాలీవుడ్ లో బడా హీరోల సినిమాల  విడుదల లేకపోవడంతో  డ్రీం గర్ల్ ఫుల్ రన్ లో 100కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. 



ఆయుష్మాన్  తన కెరీర్ లో ఈ చిత్రంద్వారా  మొదటి సారి  లేడీ  గెటప్ లో  కనిపించాడు. రాజ్ శాండిల్య  తెరకెక్కించిన ఈ చిత్రాన్ని30కోట్ల బడ్జెట్ తో  జీ స్టూడియోస్ తో కలిసి   శోభ కపూర్ , ఏక్తా కపూర్లు నిర్మించారు.  కాగా ఈ చిత్రానికి  మీట్ బ్రోస్ సంగీతం అందించగా  అభిషేక్ అరోరా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఇక ఈ చిత్రంతో ఆయుష్మాన్ వరుసగా నాలుగు విజయాలను ను ఖాతాలో వేసుకున్నాడు.  అందులో భాగంగా గత ఏడాది  బడాయి హో సూపర్ హిట్ అవ్వగా ఆతరువాత విడుదలైన  అంధధూన్ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.  అంతేకాదు ఈ చిత్రం ఉత్తమ జాతీయ  చిత్రంగా  అవార్డును కూడా గెలుచుకుంది. ఇక  ఈఏడాది  ఆర్టికల్ 15 హిట్ కొట్టిన  ఆయుష్మాన్ తాజాగా  డ్రీం గర్ల్ తో  మరో సూపర్ హిట్ కొట్టి  మోస్ట్ సక్సెస్ ఫుల్ యంగ్  హీరో అనిపించుకుంటున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: