బిగ్ బాస్ సీజన్ 3 8వ వారం న్యూ కెప్టెన్ గా వితిక షెరు గెలుపొందింది. బిగ్ బాస్ ఇచ్చిన స్పెషల్ టాస్క్ లో కెప్టెన్ గా శ్రీముఖి, వితిక, మహేష్ లు పాల్గొన్నారు. అయితే వారిలో వితిక గెలవడం విశేషం. తను కెప్టెన్ గా మారిన తర్వాత వితిక ఒక పూట మొత్తం చాలా సంతోషంగా కనిపించింది. 


అదేదో ఆమె బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయినంతగా ఫీల్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 3లో కెప్టెన్ అవడమే తన కల అన్నట్టుగా చెప్పుకొచ్చింది వితిక షెరు. అయితే వితికని కాస్త తగ్గి ఉండమని హెచ్చరించాడు వరుణ్ సందేష్. శుక్రవారం ఎపిసోడ్ లో లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకు స్పెషల్ డిన్నర్ టాస్క్ ఇచ్చాడు.


అది లగ్జరీ బడ్జెట్ తో సంబంధం లేకుండా ఉంటుంది. ఒక్కొక్కరిని బిగ్ బాస్ కన్ఫెషన్ రూంలోకి పిలిచి వాళ్లకు ఓ పని చెప్పి బయట ఇంటి సభ్యులకు అదే పనిని చెప్పి వాళ్లను కరెక్టా.. కాదా అన్నది చెప్పాల్సి ఉంటుంది. అందరు కరెక్ట్ గా చెబితే వాళ్లకు బిగ్ బాస్ స్పెషల్ డిన్నర్ ఇస్తాడు. అయితే ఈ సందర్భంలో రాహుల్ కన్ఫెషన్ రూం నుండి బయటకు వచ్చి తన మదర్ ఫోన్ చేసి మాట్లాడారని.. తను స్మోకింగ్ జోన్ కు వెళ్లడం వల్ల పెళ్లి సంబంధాలు చెడిపోతాయని చెప్పినట్టు ఇంటి సభ్యుల ముందు చెప్పాడు.


అయితే శ్రీముఖి రాహుల్ చెప్పింది నిజమే అన్నట్టుగా చెబుతూ ఇంటి సభ్యులను కూడా తన మాట వినేట్టుగా చేసింది. వినకపోతే డిన్నర్ బొక్క పడుతుందని చెప్పింది. అయితే రాహుల్ ను నమ్మి అది నిజం చెప్పగా అది అబద్ధం అని తేలింది. వరుణ్, శ్రీముఖిల గొడవకు అది దారి తీసింది. అయితే కెప్టెన్ గా మారిన కొద్దిసేపు సంతోషంగా ఉన్న వితిక ఇంట్లో ఎలాంటి గొడవలు వద్దని సర్ధిచెబుతుంది. ముఖ్యంగా వరుణ్, శ్రీముఖిల గొడవలో కూడా వరుణ్ కు వితిక సర్ధిచెప్పే ప్రయత్నం చేసింది. అలా కెప్టెన్ గా మారిన తర్వాత వితిక చాలా మారిందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: