ఆర్ ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హాట్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.  ఈ హీరోయిన్ మొదటి సినిమాతోనే ఆకట్టుకుంది.  ఫస్ట్ సినిమా హిట్టయ్యాక రెండో సినిమా కోసం చాలా కలం వెయిట్ చేయాల్సి వచ్చింది.  ఈ మధ్యలో హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను పోస్ట్ చేస్తూ పిచ్చెక్కించింది పాయల్.  సోషల్ మీడియాలో ఆమె ఫోటోలకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు.  భారీ సంఖ్యలో ఆమెను ఫాలో అవుతుంటారు.  


ఇదిలా ఉంటె, ఆమె హాట్ హాట్ అందాలను చూసి ఫిదా అయిన తేజ... తన సీత సినిమాలో స్పెషల్ సాంగ్ అవకాశం ఇచ్చారు.  స్పెషల్ సాంగ్ లో పాయల్ రెచ్చిపోయింది.  అవకాశాన్ని వినియోగించుకున్న పాయల్ మెప్పించింది.  ఈ సినిమా తరువాత పాయల్ వరసగా వెంకిమామ, డిస్కో రాజా, అలానే ఆర్డిఎక్స్ లవ్ సినిమాలు చేసింది. ఆర్డిఎక్స్ లవ్ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతున్నది. 

అటు వెంకిమామ సినిమా కూడా దీపావళికి రెడీ అవుతున్నది.  డిస్కో రాజా కూడా ఈ ఏడాది రిలీజ్ అవుతుంది.  అయితే, సీత సినిమాలో అవకాశం ఇచ్చినట్టుగానే తేజ పాయల్ కు మరో అవకాశం ఇచ్చాడు.  సీత తరహాలోనే హీరోయిన్ ప్రాముఖ్యత కలిగిన సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమాలో ఆమెకు ఓ స్పెషల్ సాంగ్ చేసే అవకాశం కల్పించారట తేజ. సినిమా ఫెయిల్ అయినా తేజ స్పెషల్ సాంగ్ మాత్రం అదిరిపోయింది.  


మరి తేజ కొత్త సినిమా ఎవరితో చేస్తున్నారనే విషయం తెలియాల్సి ఉన్నది.  ఈ విషయం తెలిసిన తరువాతగాని మిగతా విషయాలు బయటకు వస్తాయి.  పాయల్ ప్రస్తుతం మూడు  సినిమాలతో బిజీ అయ్యింది.  ఈ మూడు సినిమాలతో పాటు అటు తమిళంలో కూడా సినిమాలు చేస్తున్నట్టుగా సమాచారం. ఈ మూడు సినిమాల్లో ఓ రెండు సినిమాలు హిట్టయినా పాయల్ హీరోయిన్ గా సెట్ అయ్యినట్టే.  


మరింత సమాచారం తెలుసుకోండి: