చిరంజీవి ‘సైరా’ లో ఒక చిన్న పాత్ర అయినా చేయాలని నిహారికకు అదేవిధంగా అల్లు అర్జున్ కు ఎప్పటినుంచో ఒక కోరిక ఉంది. అయితే చరణ్ నిహారిక కోరికను తీర్చగలిగాడు కానీ బన్నీ కోరికను తీర్చలేకపోయాడు. అయితే ఎవరు ఊహించని విధంగా బన్నీ ‘సైరా’ లో కనిపించలేకపోతున్నాడు. 

వాస్తవానికి అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘అల వైకుంఠపురంలో’ ట్రైలర్ ను త్రివిక్రమ్ పుట్టినరోజు అయిన నవంబరు 7న విడుదల చేయాలని భావించారు. అయితే ఇప్పుడు ఆ ప్లాన్ మారిపోయింది. ప్రస్తుతం బన్నీ సినిమా మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ తో పోటీ పడుతున్న పరిస్థితులలో ఈ మూవీకి ముందు నుంచే క్రేజ్ పెంచాలని ఈ మూవీ ట్రైలర్ ను ‘సైరా’ ఇంటర్వెల్ గ్యాప్ లో చూపెట్టబోతున్నారు. 

ప్రస్తుతం అల్లు అర్జున్ కు మెగా అభిమానులకు చిన్న గ్యాప్ కొనసాగుతున్న పరిస్థితులలో మెగా అభిమానులలో మళ్ళీ బన్నీ క్రేజ్ పెంచడానికి ఈ వ్యూహాన్ని చాల ఆలోచించి త్రివిక్రమ్ డిజైన్ చేసినట్లు టాక్. ‘నాపేరు సూర్య’ తరువాత సుమారు ఏడాదిన్నర గ్యాప్ తో రాబోతున్న సినిమా కావడంతో ఈమూవీకి భారీ కలక్షన్స్ రావడానికి ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయో అన్ని ప్రయత్నాలు త్రివిక్రమ్ చేస్తున్నాడు. 

ఈ మూవీలో త్రివిక్రమ్ మార్క్ కామెడీ సీన్స్ చాల ఉంటాయని ప్రచారం జరుగుతోంది. కామెడీ సీన్స్ నటించే విషయంలో బన్నీకి ఎదురు లేదు కాబట్టి అటు క్లాస్ మాస్ ఆడియన్స్ కు నచ్చే విధంగా ఈ మూవీలో సీన్స్ ను చాల సహజంగా నవ్వు తెప్పించే విధంగా త్రివిక్రమ్ ఆలోచించి ఈ మూవీ కోసం డైలాగ్స్ వ్రాసినట్లు ప్రచారం జరుగుతోంది. పోతన భాగవతంలోని పద్యంలోని భావాన్ని ఆధారంగా తీసుకుని ఈ మూవీ కథను నాన్న సెంటిమెంట్ తో త్రివిక్రమ్ అల్లినట్లుతెలుస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: