నిన్న విడుదలైన ‘గ్యాంగ్ లీడర్’ మూవీకి డీసెంట్ కలక్షన్స్ వచ్చినప్పటికి ఆ మూవీ నాని కోరుకున్న స్థాయిలో సూపర్ హిట్ కాదు అన్న క్లారిటీ వచ్చేసింది. దీనికితోడు ఈ మూవీలో యూత్ కు నచ్చే విషయాలు లేకపోవడంతో ఈమూవీ కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే డీసెంట్ మూవీగా సెటిల్ అయ్యే ఆస్కారం కనిపిస్తోంది. 

దీనితో నాని ఈ మూవీ విషయంలో పెంచుకున్న అంచనాలు తారుమారు కావడం వెనుక రెండు కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఈ మూవీ డైరెక్టర్ విక్రమ్ కుమార్ ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా తీయలేకపోవడం ఒక లోపం అయితే ఈ మూవీ ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన ప్రియాంక అరుల్ మోహన్ మరో లోపం అన్న కామెంట్స్ వస్తున్నాయి.

వాస్తవానికి నాని గత సినిమాల ద్వారా చాలామంది మళయాళ బ్యూటీస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్స్ గా పరిచయం అయ్యారు. నివేద థామస్ అను ఇమాన్యుల్ శ్రద్ధా శ్రీనాథ్ లాంటి చాలామంది హీరోయిన్స్ నాని సినిమాల ద్వారా పరిచయం అయి తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు. గ్లామర్ విషయంలో మాత్రమే కాకుండా నటన విషయంలో కూడ తమకు వచ్చిన అవకాశాన్ని వారు బాగా వినియోగించుకున్నారు.  

అయితే నిన్న విడుదలైన ‘గ్యాంగ్ లీడర్’ మూవీలో పరిచయం అయిన ప్రియాంక మోహన్ అటు నటన పరంగా కాని ఇటు గ్లామర్ పరంగా కాని నాని ముందు తేలిపోవడంతో ఈమూవీకి ఆమె వల్ల వచ్చిన ప్రయోజనం ఏమిలేదు. దీనికితోడు ఈమూవీ సెకండ్ ఆఫ్ అంతా స్లోగా నడవడంతో పాటు ప్రేక్షకులను మైమరపించే ట్విస్ట్ లు లేకపోఅవడంతో ఈ మూవీ బయ్యర్లకు ఖచ్చితంగా నష్టాలు తప్పవు అన్న ప్రచారం జరుగుతోంది. దీనితో నాని నటించే సినిమాల కథలు అన్ని వర్గాలకు కనెక్ట్ అయ్యే విధంగా ఎంచుకోలేకపోతే నానీకి సమస్యలు తప్పవు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: