చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'ఎప్పుడైతే ఈ సినిమాని స్టార్ట్ చేసారో అప్పటి నుండి ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటూనే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంటూ చివరికి దశకు చేరుకుంది.ఇక రిలీజ్‌కు రెండు వారాల సమయం వుందనగా వెంటాడం మానని వివాదం మరోటి సైరాకు అడ్డుతగిలింది.అక్టోబర్ 2న విడుదల కాబోతున్న ఈ సినిమా బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే.ఏ వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిందో,వారే ఇప్పుడు తమకు న్యాయం చేయాలంటూ ఈరోజు హైదరాబాదులోని చిరంజీవి కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.



సైరా సినిమా తీసే సమయంలో సినిమాకు అవసరమైన విషయాలను తమ నుంచి తీసుకుని,నరసింహారెడ్డి జీవితం గురించి తెలుకున్నారని,ఈ సందర్భంగా వారు చెప్పారు. సినిమా పరిశ్రమ వల్ల మాకు అన్యాయం జరిగిందని,తమకు న్యాయం చేస్తామని ఆ సమయంలో చిరంజీవి హామీ ఇచ్చారని,కానీ,ఇంతవరకు న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఆందోళన గురించి సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడకు వెళ్లి,వారిని ప్రశ్నించగా విషయం మొత్తం చెప్పి ప్రస్తుతం తమకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.తమకు న్యాయం జరిగేలా చూడాలని పోలీసులకు విన్నవించారు.ఇక ఈ నెల 18న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎల్.బి. స్టేడియంలో జరగనుంది.అంతే కాదు అక్టోబర్ 2న ఈ సినిమా అన్ని భాషల్లో విడుదల కానుంది.ఇటువంటి సమయంలో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకు ఈ అడ్డంకు ఎంట్రా బాబు అని అభిమానులు తలలు పట్టుకుంటున్నారు..ఇప్పటికే ఓవర్సీస్ లో కూడా భారీ బిజినెస్ జరిగి అందరు ఆసక్తితో ఎదురుచూస్తున్న సమయంలో తాజాగా తెరపైకి వచ్చిన ఈ వివాదాన్ని చిత్రయూనిట్ ఎలా పరిష్కరిస్తారో అని అందరు గుసగుసలాడుకుంటున్నారు.చూద్దాం ఎవరికి న్యాయం జరుగుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: