నాచురల్ స్టార్ నాని, విక్రం కె కుమార్ డైరక్షన్ లో వచ్చిన మూవీ గ్యాంగ్ లీడర్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో నాని సరసన ప్రియాకా అరుల్ మోహన్ నటించింది. సినిమాలో సీనియర్ నటి లక్ష్మి, శరణ్యలు కూడా వారి నటనతో మెప్పించారు. నిన్న రిలీజైన గ్యాంగ్ లీడర్ సినిమా ప్రేక్షకుల నుండి మంచి స్పందన తెచ్చుకుంది. 


గ్యాంగ్ లీడర్ సినిమా 28.20 కోట్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ తో రిలీజైంది. అయితే మొదటిరోజు ఈ సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లో 4.55 కోట్లను కలెక్ట్ చేసింది. అయితే అందరి హీరోల్లా రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలను కాకుండా కొత్త కథలతో వస్తున్నాడు నాని. ఆల్రెడీ ఈ ఇయర్ జెర్సీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాని గ్యాంగ్ లీడర్ తో కూడా హిట్టు కొట్టాడు.  


అయితే నాని ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నా స్టార్ రేంజ్ కలక్షన్స్ రాబట్టడంలో మాత్రం వెనుకపడుతున్నాడు. తన సినిమాలన్ని పాజిటివ్ టాక్ తెచ్చుకుంటున్నాయి. అసలైతే స్టార్ హీరో సినిమాకు హిట్ టాక్ వస్తే కలక్షన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. కాని నాని సినిమాలకు మాత్రం వసూళ్లు ఆశించిన స్థాయిలో ఉండట్లేదు. 


జెర్సీ సినిమా కూడా సూపర్ అని అందరు మెచ్చుకున్నా ఆ రేంజ్ కలక్షన్స్ మాత్రం రాలేదు. గ్యాంగ్ లీడర్ విషయంలో కూడా అలానే జరిగే అవకాశం కనిపిస్తుంది. స్టార్ సినిమా మొదటిరోజు కనీసం 10 కోట్లు రాబట్టాలి మొన్నీమధ్య వచ్చిన విజయ్ దేవరకొండ సినిమా ఫస్ట్ డే 8 నుండి 10 కోట్ల దాకా రాబడుతున్నాడు. కాని నాని మాత్రం 4 నుండి 5 మధ్యలో ఉంటున్నాడు. నాని స్టార్ హీరోనే కాని రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ప్రయోగాలు చేయడం వల్ల ఇలాంటి రిజల్ట్ వస్తుందని అంటున్నారు. కాని కొందరు ప్రేక్షకులు మాత్రం అందరి దారిలో కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్నాడు నాని. నాని లాంటి వారు మాత్రమే ఇలాంటి సినిమాలు చేస్తారని చెబుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: