బాల్యం ఎవరికైనా మధుర జ్ఞాపకమే.  నేటి రోజుల్లో చేతిలోని ఫోన్ల ద్వారా డిస్కుల్లో, క్లౌడ్ స్టోరేజీల్లో నిక్షిప్తమవుతున్నాయి. కొన్నేళ్ల క్రితం అలాంటి బాల్యాన్ని అందరూ ఫోటోలు రూపంలో, వీడియో రూపంలో చేసుకున్నారు.. అరకొరగా. అదే బాల్యాన్ని, ముఖ్యంగా నేల మీద పాకుతూ ఉండే మధుర క్షణాలు సినిమా రూపంలో తెరకెక్కితే.. అది ఎంత ఆనందపడిపోతామో.. ఎంత సంబరపడిపోతామో కదా. అక్కినేని నట వారసుడు అఖిల్ విషయంలో అదే జరిగింది.

 

 

 

1995 సెప్టెంబర్ 14న నేటికి సరిగ్గా 24 ఏళ్ల క్రితం 'సిసింద్రీ' టైటిల్ తో అఖిల్ ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కింది. 1994లో హాలీవుడ్ లో వచ్చిన బేబీస్ డే అవుట్ అనే సినిమాకు రిమేక్ గా ఈ సినిమా నిర్మించాడు నాగార్జున. అన్నపూర్ణ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమాతో అఖిల్ అప్పట్లోనే తొలి హిట్  సాధించాడు. పాలుగారే అఖిల్ ను చూసి ఆంధ్రావని మొత్తం ముచ్చటపడిపోయింది. అంత ముద్దుగా కేవలం 11 నెలల వయసుకే ఆ సినిమాలో నటించి తన బుడి బుడి అడుగులతో అలరించాడు. అఖిల్ మూడ్ బాగుండటానికి, నవ్వడానికి కొన్ని సీన్లలో అమల నటించింది. ఆమె చేతులు మాత్రమే కొన్ని సీన్లలో కనబడతాయి. అఖిల్ కెమెరా ముందు నవ్వడానికి అమల అక్కడే ఉండి ఆడించేదట. సినిమాలో నాగార్జున రెండు పాటల్లో నటించారు. తండ్రీ కొడుకులిద్దరూ ఆ సినిమాలో కనిపించడం ముచ్చటగొలిపింది. శివనాగేశ్వర రావు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రాజ్ సంగీతం అందించారు. 

 

 

 

అఖిల్ మొదటి పుట్టినరోజున ఈ బుడతడిని ఎత్తుకున్న చిరంజీవి.. 'అఖిలాంధ్ర కోటి అఖిల్' అన్నారట. ఇప్పుడు హీరో స్థాయికి ఎదిగిన అఖిల్ కు అక్కినేని వంశం ఇచ్చిన అరుదైన జ్ఞాపకం 'సిసింద్రీ' సినిమా. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నాడు అఖిల్.

మరింత సమాచారం తెలుసుకోండి: