ఒక హీరోని పొగ‌డ‌డం అంటే సామాన్యంగా ఎంతో మంచి పేరు ఉంటేనేగాని పొగ‌డ‌రు. అలాంటిది గోపిచంద్ చాలా గ్యాప్ త‌ర్వాత చేస్తున్న చిత్రం చాణ‌క్య అడ‌పాద‌డ‌పా ఎన్ని చిత్రాల్లో న‌టించినా ఈ మ‌ధ్య కాలంలో చెప్పుకోద‌గ్గ విజ‌యాల‌యితే లేవ‌నే చెప్పాలి. గోపీచంద్ హీరోగా మెహ్రీన్, జరీన్ ఖాన్ హీరోయిన్స్ గా ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం 'చాణక్య'. స్పై యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ రోజు ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల‌యింది. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల సమావేశంలో ఆ చిత్ర నిర్మాత‌, ద‌ర్శ‌కుడు, డైలాగ్ రైట‌ర్‌తో స‌హా క‌లిపి ఆయ‌న‌ను తెగ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. ఆయ‌న చాలా మంచి హీరో అని. డెడికేటెడ్ అని, ఎక్కువ‌గా ఇబ్బంది పెట్ట‌డ‌ని. చాలా మంచి హ్యూమ‌న్ బీంగ్ అన్నారు.


దర్శకుడు తిరు మాట్లాడుతూ.. ఇప్పటివరకు నేను తమిళంలో నాలుగు ఫిలిమ్స్ చేశాను. తెలుగులో ఇది నా మొదటి సినిమా. ప్రతి మనిషి జీవితంలో రెండింటిని లీడ్  ఒకటి  అబద్దం,రెండు నిజం. ఇండియన్ డ్రా ఏజెంట్ గా గోపీచంద్ ఈ సినిమాలో  కనిపిస్తారు. ఇది నా మనసుకి బాగా నచ్చిన స్క్రిప్ట్. అనిల్ సుంకర గారు బడ్జెట్  విషయంలో కాంప్రమైజ్ అవకుండా ఈ చిత్రాన్ని అమేజింగ్ గా నిర్మించారు. అబ్బూరి రవి సూపర్బ్  డైలాగ్స్ రాశారు. ఇక గోపీచంద్ గారు కథవిని నన్నెంతో ప్రోత్సహించారు. వెరీ గుడ్ బ్రిలియంట్ యాక్టర్. రాజస్థాన్ లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించే సమయంలో అనుకోకుండా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్ కి తీసుకెళ్ళాం. ఐ సి యు లో పెట్టారు. వెంటనే రికవరీ అయి షూటింగ్ కంప్లీట్ చేశారు. గోపి గారి సపోర్ట్ వల్లే సినిమాని త్వరగా కంప్లీట్ చేయగలిగాము. నేను చాలా సినిమాలు చేశాను. ప్ర‌తి ఆర్టిస్ట్ త‌ను సీన్ చేసిన త‌ర్వాత ఒక‌సారి కెమెరా ముందుకు వ‌చ్చి చూసుకుంటారు. కాని గోపిగారు అలా కాదు షాట్ మీకు ఓకే అయితే నాకు ఓకే అనేవారు. చాలా డెడికేటెడ్‌గా ప‌ని చేసేవారు. ఎప్పుడూ పెద్ద‌గా ఇబ్బంది పెట్ట‌లేదు. అందరం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేశాం. తప్పకుండా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకంతో వున్నాం.. అన్నారు. 


మాటల రచయిత అబ్బూరి రవి మాట్లాడుతూ.. ఇది స్పై థ్రిల్లర్ చిత్రం అయినా థ్రిల్స్, యాక్షన్, ఎక్సయిట్ మెంట్ కలిగిస్తాయి. యాక్షన్ ని కొత్త వేలో చూపించారు..తిరు.  అనిల్ సుంకర గారు ఈ సినిమాకి ఫుల్ సపోర్ట్ చేశారు. అనుకున్న బడ్జెట్ కన్నా కథ కి ఏంకావాలో దానికి మించి ఖర్చుపెట్టారు ఆయన. ఏకే బ్యానర్‌లో సినిమా చేయడం చాలా హ్యాపీగా వుంది. గోపీచంద్ ఫస్ట్ టైం ఓ కొత్త జోనర్‌లో చేసిన సినిమా ఇది. అనుక్షణం ఏంజరుగుతుందా? అని ఉత్కంఠని కలిగిస్తుంది. హీరో, విలన్ల మధ్య ఎత్తుకి పై ఎత్తులు వేసే సన్నివేశాలు నువ్వా-నేనా అన్నట్లుగా ఉంటాయి. అందరికీ నచ్చే విధంగా ఈ చిత్రం ఉంటుంది.. అన్నారు. నిర్మాత‌, ద‌ర్శ‌కుడు చెప్పిన‌ట్లు గోపిచంద్ చాలా మంచి హ్యూమ‌న్ బీంగ్‌. నాకు ఆయ‌న‌తో ఇది రెండ‌వ చిత్రం. ఎంత త‌క్కువ బ‌డ్జెట్‌లో సినిమా అయితే అంత త‌క్కువ బ‌డ్జెట్ చేద్దాం అనేవారు అలా ఆలోచించే వారు చాలా త‌క్కువ  అని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: