బిగ్ బాస్ సీజన్ 3 లో మరో ఆసక్తికరమైన వీకెండ్ వచ్చేసింది. వారం రోజులపాటు హౌస్ మేట్స్ చేసిన పనులలోని తప్పొప్పులని వివరించుతూ షో ని మరో లెవెల్ కి తీసుకుపోతున్నాడు  హోస్ట్ నాగార్జున. మాములుగా డైలీ  మన టీవీ ద్వారా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లడం.. కంటెస్టెంట్స్‌తో కాస్త ముచ్చట్లు చెప్పడం.. వీలైతే నవ్వించడం, కుదరకపోతే కాస్త క్లాస్ పీకడం, వారం వారం ఒక్కర్ని ఎలిమినేట్ చేయడం.. ఇది రొటీన్‌గా జరిగేదే. అయితే ఎప్పుడూ ఇలా రొటీన్ స్క్రిప్ట్ ఉంటే మస్త్ ఏం ఉంటుందని నేటి ఎపిసోడ్‌ని కాస్త డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు. 

మోడల్స్ సాంగ్స్‌తో ఎప్పుడూ ఎంట్రీ ఇచ్చే నాగార్జున నేటి ఎపిసోడ్‌లో అందరికీ షాక్ ఇచ్చారు. నేను చాలా సీరియస్‌గా ఉన్నా.. కంటెస్టెంట్స్‌పై పీకల వరకూ ఉంది. వాళ్లతో చాలా మాట్లాడాలి అంటూ బిగ్ బాస్ హౌస్‌‌ని మన టీవీ ద్వారా షాకింగ్ ఎంట్రీ ఇచ్చారు. నా షూని నేను రోజూ పాలిష్ చేసుకోను. కాని నేను ఈరోజు పాలిష్ ఎందుకు చేస్తున్నా అంటే.. ఏ పని చిన్నది కాదు అని చెప్పడానికి. చేసే పనిని బట్టి మనిషి స్థాయి తగ్గడం పెరగడం ఉండదు. చేసే తీరుని బట్టే ఉంటుంది.
మహేష్ లేచి నిలబడు.. నీకు ఆడిషన్స్ లేవు. బిగ్ బాస్ ఇన్విటేషన్ మీదే వచ్చాను అన్నావు. ఏంటి ఈ చెత్త పనులు.. షూ పాలిష్ చేయడం, డ్రాయర్‌లు ఉతకడం అంటూ ఏదేదో మాట్లాడావు. మాకు ఇవన్నీ అవసరమా.. అంటున్నావ్. నువ్ ఏమీ ఇక్కడ ఇరగదీయడం లేదు. ఇన్విటేషన్ మీద వచ్చావా.. నీ ఇన్విటేషన్ క్యాన్సిల్ చేస్తున్నా.. బిగ్ బాస్ డోర్లు తెరుస్తున్నా.. నువ్ ఇప్పుడే వెళిపోవచ్చు. డిసిషన్ తీసే ఉంది ఇప్పుడు వెళిపో. నువ్ కన్వెన్స్ అయ్యి టాస్క్ చేసినందుకు మాత్రమే నిన్ను బిగ్ బాస్ హౌస్‌లో ఉంచుతున్నాం’ అంటూ నాగార్జున గట్టి క్లాస్ పీకారు మహేష్‌కి.


మరింత సమాచారం తెలుసుకోండి: