బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఎలాంటి కథ సెలెక్ట్ చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్స్ కొడతాడో అందరికి తెలిసిందే. అమీర్ సినిమా అంటే ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ అని బ్లైండ్ గా నమ్మి తీరుతారు. అయితే గత ఏడాది 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తీవ్రంగా నిరాశ పరిచినన విషయం తెల్సిందే. చాలా కాలం తర్వాత అమీర్ ఖాన్ ఫ్లాప్ ను చూశాడు. దాంతో కాస్త గ్యాప్ తీసుకుని నెక్స్ట్ సినిమాను మొదలు పెట్టాడు. ప్రస్తుతం అమీర్ హాలీవుడ్ మూవీ 'పారెస్ట్ గంప్'ను 'లాల్ సింగ్ చద్దా' అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా కోసం అమీర్ ఖాన్ తన లుక్ ను పూర్తిగా మార్చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలోనే ఇద్దరు తమిళ స్టార్స్ నటించబోతున్నట్లుగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

నిన్నటి వరకు తమిళ హీరో విజయ్ సేతుపతిని కీలక పాత్ర కోసం 'లాల్ సింగ్ చద్దా' యూనిట్ సభ్యులు సంప్రదించినట్లుగా వార్తలు వచ్చాయి. కాని ఆ వార్తలపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాకుండనే ఇప్పుడు అదే సినిమాలోని మరొక కీలక పాత్ర కోసం తమిళ స్టార్ కమెడియన్ యోగి బాబును ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. 'పారెస్ట్ గంప్' సినిమాలో ముఖ్యమైన 'బుబ్బా' అనే పాత్ర ఒకటి ఉంటుంది. సినిమా మొత్తం కూడా ఆ పాత్ర హాస్యంను పంచడంతో పాటు క్లైమాక్స్ లో ప్రేక్షకులు చాలా ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది.
బుబ్బా పాత్రకు యోగి బాబు అయితేనే సూపర్బ్ గా సెట్ అవుతాడు అంటూ యూనిట్ సభ్యులు బలంగా నమ్ముతున్నారు. అందుకే ఆయన కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట. ప్రస్తుతం కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్.. బిజీ కమెడియన్ యోగి బాబు. ఒకేసారి యోగి 10-12 సినిమాల్లో నటిస్తు బిజీగా ఉన్నాడు. అదే సమయంలో హీరోగా కూడా సినిమాలు ట్రై చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో బాలీవుడ్ 'లాల్ సింగ్ చద్దా' సినిమా కి డేట్స్ ఇస్తాడా అన్నది సస్పెన్స్ గా ఉంది.

అమీర్ ఖాన్ వంటి సూపర్ స్టార్ మూవీలో నటించే అవకాశం రావడం అనేది ఒకరకంగా గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. మరి యోగి బాబు ఆ అవకాశంను సద్వినియోగం చేసుకుంటాడా లేదంటే బిజీ కారణంగా వదిలేస్తాడా అనేది చూడాలి. విజయ్ సేతుపతి, యోగి బాబులు 'లాల్ సింగ్ చద్దా' సినిమాలో నటిస్తున్నారనే విషయంలో యూనిట్ సభ్యులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే అమీర్ ఇలా హాలీవుడ్ మూవీని రీమేక్ చేస్తాడని ఎవరు అనుకోలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: