అష్టా చమ్మ సినిమాతో హీరోగా తెలుగు సినిమా పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన నాని, ఆ తరువాత వరుసగా అవకాశాలు దక్కించుకుని ముందుకు సాగారు. అయితే కెరీర్ పరంగా కొన్ని ఫ్లాప్స్ కూడా చవి చూసిన నాని, ఇటీవల వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. ఇక ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా, సూపర్ హిట్ టాక్ తో మరియు అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకెళుతోంది. ఆకట్టుకునే కథ మరియు కథనాలతో తెరకెక్కిన ఈ సినిమాలో నాని, పెన్సిల్ పార్ధసారధి అనే రచయిత పాత్రలో నటించి ప్రేక్షకుల మదిని దోచారు. 

మంచి ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషన్ కూడా దాగి ఉన్న ఆ పాత్రలో నాని, ఎంతో ఒదిగిపోయి నటించారు అనే చెప్పాలి. సాధారణ ప్రేక్షకుల దగ్గరి నుండి పలువురు సినిమా ప్రముఖుల వరకు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తుండడంతో, యూనిట్ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. అయితే ఈ సినిమా విషయమై నేడు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అదేమిటంటే, ఇదే గ్యాంగ్ లీడర్ సినిమాని మరొక హీరో అయితే తప్పనిసరిగా చేయడానికి ముందుకు రారని అంటున్నారు ఆయన ఫ్యాన్స్ కొందరు. దానికి కారణాలుగా వారేమి చెప్తున్నారంటే, అసలు సినిమాలోని మెయిన్ పాయింట్ తన మీద కాకుండా, మిగతా ఇతర ఆడవాళ్ళ పాత్రలతో ఎక్కువగా కనెక్ట్ అయి ఉండడం, సెకండ్ హాఫ్ మొదలైన దగ్గరినుండి తనతో సమానంగా దేవ్ క్యారెక్టర్ కూడా చాలావరకు ట్రావెల్ అవుతుండడం, 

అలానే కమెడియన్ వెన్నెల కిశోర్ తో కలిసి ఏ మాత్రం బెరుకు లేకుండా గే సన్నివేశాల్లో యాక్ట్ చేయడం, ఇక మరీ ముఖ్యంగా తన హీరోయిక్ ఇమేజిని పెంచే ప్రత్యేకమైన సాంగ్స్, ఫైట్స్, రొమాంటిక్ సీన్స్ వంటివి లేకపోయినా కథని నమ్మి ఒకే చెప్పడం వంటివి, కేవలం నాని లాంటి హీరోకి మాత్రమే సాధ్యమైందని, కచ్చితంగా ఆయన కాకుండా వేరే హీరో మరెవరైనా సరే ఈ గ్యాంగ్ లీడర్ లో నటించి ఉంటె, ఈ కథలో ఖచ్చితంగా కొంతైనా మార్పులు జరిగి ఉండేవని అంటున్నారు. నిజానికి వారు చెప్తున్న వాదనలో కూడా చాలా వరకు నిజం ఉందని, ఎందుకంటే నేటి హీరోల్లో కేవలం కథనే హీరోగా నమ్మి నటించడానికి ముందుకు వచ్చే వారు చాలా తక్కువ అని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు......!!


మరింత సమాచారం తెలుసుకోండి: