బిగ్ బాస్ సీజన్ 3 నాగార్జున హోస్ట్ గా సూపర్ ఎంటర్టైనింగ్ అందిస్తుంది. ఎప్పటిలానే హౌజ్ లో 8వ వారం కూడా గొడవలు జరిగాయి. అయితే ఈసారి ఇంటి సభ్యుల్లో కొందరు బిగ్ బాస్ ఆదేశాలను సైతం లెక్క చేయలేదు. అయితే ఈ సీజన్ బిగ్ బాస్ గురించి సెకండ్ సీజన్ విన్నర్ కౌశల్ ఏమనుకుంటున్నాడని తెలుసుకోవాలని ఉంటుంది కదా.


రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కౌశల్ ను బిగ్ బాస్ కు సంబందించిన ప్రశ్నలను అడిగారు. ప్రస్తుతం సీజన్ 3లో ఇంకా కంటెస్టంట్స్ ఎవరు తమ ముసుగులు తీయలేదని అన్నాడు కౌశల్. ఇంట్లో సభ్యులంతా నటిస్తున్నారు.. వారు నటించడం మానేసి ఎప్పుడైతే రియల్ గా ప్రవార్తిస్తారో అప్పుడే ఫేవరేట్ అనేది ఏర్పడుతుంది.


ఇక ఈ సీజన్ విన్నర్ ఎవరయ్యే ఛాన్సులు ఉన్నాయని కౌశల్ ను అడుగగా.. తాను చెబితే ఇతరుల ఆట చెడగొట్టినట్టు అవుతుందని అన్నాడు కౌశల్. అందుకే కౌశల్ ఎవరి పేరు చెప్పలేదు. బిగ్ బాస్ రెండో సీజన్ లో ఐదు, ఆరు వారాలకే విజేత కౌశల్ అని డిసైడ్ అయ్యింది. బయట కౌశల్ ఆర్మీ అని ఒకటి ఏర్పడి అతనికి సపోర్ట్ గా నిలిచారు. 


అయితే బిగ్ బాస్ సీజన్ 3లో ఇప్పటివరకు విన్నర్ ఎవరన్నది గెస్ చేయలేకపోతున్నారు. స్ట్రాంగ్ కంటెస్టంట్ అనుకున్న అలి రెజా లాస్ట్ వీక్ ఇంటి నుండి బయటకు వచ్చాడు. ఇప్పుడు హౌజ్ లో ఉన్న వారిలో ఎవరు విన్నర్ అయ్యేది మాత్రం చెప్పలేం. కౌశల్ ఒపీనియన్ చెబితే అతనెవరినైతే చెప్పాడో అతను లేదా ఆమెనే ఫాలో అయ్యి ఓటు వేసే అవకాశం ఉంది. యాంటీ కౌశల్ ఫ్యాన్స్ అతనెవరి పేరు చెప్పాడో వారిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. అందుకే కౌశల్ ఎవరు విన్నర్ అయ్యేదన్నది చెప్పలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: