ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఛాన్స్ రావడమే గొప్ప అనుకుంటారు. అయితే కెరియర్ మొదట్లోనే ఓ సూపర్ హిట్ అందుకుంటే ఆ హీరో రేంజ్ వేరేలా ఉంది. అయితే సడెన్ గా ఎవరు ఊహించని విధంగా అతను విలన్ గా మారి సర్ ప్రైజ్ ఇచ్చాడు. విలన్ గా నటించిన సినిమా హిట్ అవడంతో అతను హీరోగా కొనసాగుతాడా.. విలన్ గానే సినిమాలు చేస్తాడా అన్న కన్ ఫ్యూజన్ ఏర్పడింది.


ఇంతకీ ఎవరా హీరో అన్నదే కదా మీ డౌట్ ఇంకెవరు ఆరెక్స్ 100 హీరో కార్తికేయ. మొదటి సినిమా ఎవరికి తెలియకుండానే వచ్చింది వెళ్లింది. అయితే కార్తికేయ రెండో సినిమా ఆరెక్స్ 100 మాత్రం సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఆ సినిమాతో ఈ హీరోకి మంచి ఐడెంటిటీ వచ్చింది. అయితే ఆ తర్వత హిప్పీ, గుణ 369 సినిమాలు చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.


లేటెస్ట్ గా నాని గ్యాంగ్ లీడర్ లో కార్తికేయ విలన్ గా నటించాడు. దేవ్ పాత్రలో కార్తికేయ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. అయితే హీరోగా సినిమాలు చేస్తున్న కార్తికేయ ఇలా సడెన్ గా విలన్ గా మారడంపై ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. విలన్ గా హిట్టు కొట్టాడు కాబట్టి కచ్చితంగా మరిన్ని అవకాశాలు వస్తాయి.


మరి నాని కాబట్టి గ్యాంగ్ లీడర్ లో విలన్ గా చేశాడు. మరో స్టార్ హీరో సినిమాలో విలన్ గా వస్తే కూడా చేసేలా ఉన్నాడు. ఇలా హీరోగా ఎంట్రీ ఇచ్చి విలన్ గా మారుతాడేమో అని ప్రేక్షకులు డౌట్ పడుతున్నారు. కార్తికేయ హీరోనా.. విలనా అనేది తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. గ్యాంగ్ లీడర్ మాత్రం కార్తికేయ కెరియర్ కు ప్లస్ పాయింట్ అనే చెపొచ్చు.  
 


మరింత సమాచారం తెలుసుకోండి: