‘సైరా’ మూవీ విడుదలకు ఇక కేవలం 16 రోజులు మాత్రమే ఉన్న పరిస్థితులలో ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు నిన్న మధ్యాహ్నం చిరంజీవి ఆఫీసు ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమం శ్రుతి తప్పి అరెస్టులకు దారి తీయడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితానికి సంబంధించి అదేవిధంగా ఆయన జీవిత ఘట్టంలోని కీలక సంఘటనల గురించి పూర్తి వివరాలు తమ వద్ద తెలుసుకుని చివరికి తమకు గుర్తింపు ఇవ్వకుండా మాట తప్పారు అంటూ నిరసన కార్యక్రమాన్ని కొందరు ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు నిర్వహించారు అని వార్తలు వస్తున్నాయి. 

అంతేకాదు గతంలో తాము చిరంజీవిని కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తే తమకు అన్ని విధాల సహాయం చేస్తామని మాట ఇచ్చిన ఛిరంజీవి ఇప్పుడు మాట తప్పాడు అంటూ వారు ఆందోళన చేసినట్లుతెలుస్తోంది. దీనితో పరిస్థితి చేయి దాటిపోతోంది అని గ్రహించిన మెగా కాంపౌండ్ సూచనతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అరెస్టులు చేసినట్లు కొన్ని మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచారం చేస్తున్నాయి.

దీనితో ఉయ్యాలవాడ కుటుంబ సబ్యుల అసహనం తీవ్ర స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. దీనికితోడు ఈ సినిమాను ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు కోరిన విధంగా విడుదలకు ముందు వారందరికీ చూపించాలి అన్న సూచనను కూడ మెగా కాంపౌండ్ తిరస్కరించినట్లు టాక్. 

ఇప్పుడు ఈ వార్తలు ఇలా వైరల్ అవుతుండటంతో పాటు ఈ మూవీ గురించి ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు కొన్ని కేసులు కూడ ఇప్పటికే న్యాయస్థానంలో వేసిన నేపధ్యంలో పరిస్థితులు ఎలాంటి టర్న్ తీసుకుంటాయి అన్న ఆసక్తి పెరుగుతోంది. జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్న మెగా కాంపౌండ్ సన్నిహితులు కొందరు సున్నితమైన ఈ విషయం పై అశ్రద్ధ చేయడం మంచిది కాదు అని చరణ్ కు సలహాలు ఇస్తున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: