ఈవారం విడుదల కాబోతున్న ‘వాల్మీకి’ మూవీని ప్రమోట్ చేస్తూ ఈరోజు జరుగుతున్న ఫాదర్స్ డే సందర్భంగా హరీష్ శంకర్ ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు తెలియచేసాడు. ఏ వ్యక్తికి అయినా జ్ఞానోదయం చదువుకున్న చదువులు వల్ల కాని లేదంటే పెరుగుతున్న వయస్సు వల్ల కాని రాదనీ జీవితంలో తగిలే ఎదురు దెబ్బలు మనిషి జీవితాన్ని మార్చేస్తాయి అంటూ కామెంట్స్ చేసాడు. 

ఆంధ్రభూమి స్వాతి లాంటి పత్రికలలో కథలు వ్రాసి మెప్పించిన తాను సినిమాలు తీయడం చాల సులువు అనుకుంటూ ఈ ఇండస్ట్రీకి వచ్చి ఎదుర్కున్న అవమానాలు పరాజయాలు తనకు ఎన్నో పాఠాలు నేర్పాయి అని అంటున్నాడు. సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన తనకు సినిమాల పిచ్చి ఏర్పడటంతో తన సినిమా పిచ్చిని చూసి ఇంచుమించు తన చుట్టాలు అంతా తనను వెలివేసినా తన తండ్రి తనను సెటిల్ చేద్దామని పడ్డ కష్టాలు ఆయన గడిపిన నిద్రలేని రాత్రులు తనను మనిషిని చేసాయి అని అంటున్నాడు. 

తాను ఘోస్ట్ రైటర్ గా పనిచేసిన రోజుల గురించి గుర్తుకు చేసుకుంటూ తనకు ఒక ఏసీ రూమ్ ఇచ్చి టైమ్ కు భోజనం పెట్టి కొన్ని డివిడీలు ఇచ్చి ఆ సినిమాలు చూస్తూ కథలు రాయమని అడిగిన కొందరు నిర్మాతలను చూస్తే తనకు విపరీతమైన కోపం అసహనం ఏర్పడిన విషయాలను గుర్తుకు చేసుకున్నాడు. మరికొందరు నిర్మాతలు అయితే తన చేత పని చేయించుకుని డబ్బు ఎగ్గొట్టిన సందర్భాలను వివరించాడు. 

అయితే అలాంటి నిర్మాతలు కొందరు ఆతరువాత ఆర్ధిక ఇబ్బందులవల్ల చితికిపోయి తనకు ఎదురైనప్పుడు తాను వారికి ఆర్ధిక సహాయం చేసి వారి పై విచిత్రంగా రివర్స్ ప్రతీకారం తీర్చుకున్నాను అంటూ హరీష్ ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ఏమనిషికి అయినా పరాజయానికి మించిన శిక్ష ఉండదనీ ఆ పరాజయంతో పోరాడి గెలిచినవాడు మాత్రమే గుర్తింపు పొందగలుగుతాడు అంటూ ఈవారం విడుదల కాబోతున్న ‘వాల్మీకి’ సూపర్ హిట్ అని అంటున్నాడు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: