ముంబై బ్యూటీ హన్సిక చాలా చిన్న వయసులో తన సినీ కెరియర్ ను ప్రారంభించింది. దాదాపుగా ఐదు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. తెలుగులో కూడా ఓ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. బన్నీ దేశముదురు సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది. ఆ సినిమా హిట్ అవ్వడంతో వరుసగా సినిమాలలో నటిస్తూ వచ్చింది. చిన్న హీరోల సరసన జోడి కట్టింది. 

అతి చిన్న వయసులో సినిమాలలో కి వచ్చిన ఈమె నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ మాటకొస్తే ఆమె కేవలం తెలుగులోనే కాదు తమిళ్, హిందీ భాషల్లో కూడా నటిస్తూ వచ్చింది. అక్కడ కూడా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత కొంతకాలం గా తెలుగులో ఈమె సినిమాలు రాలేదని చెప్పాలి. హిందీ, తమిళ్లో మాత్రం చిత్రాలలో నటిస్తూ వస్తుంది. 

ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఈమె తెలుగు సినిమాలో నటిస్తుంది. ఆ సినిమా అయినా ఆమెకు సక్సెస్ ను తీసుకొస్తుందేమో అని ఆమె ఆశగాఎదురు చూస్తుంది. ప్రస్తుతం ఈమె యువ హీరో సందీప్ కిషన్ సరసన జతకడుతుంది. ఆ సినిమానే 'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్‌'. ఈ సినిమాకు జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఒకేసారి తెలుగు, తమిళ్లో రిలీజ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు ఆ చిత్ర యూనిట్. 

ఈ సినిమా పోస్టర్ ను విడుదల చేసారు. రేపు  11 గంటలకు టీజర్‌ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కామెడీ కోణంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. భూమిక చావ్లా,మురళీ శర్మ, బ్రహ్మానందం, వెన్నెల కిశోర్ తదితరులు ప్రముఖ పాత్రల్లో నటిస్తున్నారు.సాయి కార్తిక్ సంగీతాన్ని సమకూర్చగా, శ్రీరామ్ ఈ సినిమాకు కెమెరా మ్యాన్ గా పనిచేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: