టాలీవుడ్ యంగ్ హీరో గొపీచంద్ గత కొంత కాలంగా విజయాలు లేక విసిగిపోయి ఉన్నాడు. లౌక్యం తర్వాత గోపిచంద్ కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమా రాలేదు. అందుకని ఇప్పుడు గోపీచంద్ కి విజయం ఎంతో ఆవశ్యకం. ప్రస్తుతం గోపీచంద్ తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో యాక్షన్ స్పై థ్రిల్లర్ జానర్ లో ఒక సినిమా తెరకెక్కింది. అదే చాణక్య. అయితే ఇటీవలే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. నెటిజన్లను బాగా ఆకట్టుకున్న ఈ టీజర్ మొత్తానికి సినిమా పై అంచనాలను పెంచింది.


టీజర్ చూస్తుంటే ఈ చిత్రంలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలుస్తాయని అనిపిస్తోంది. ఈ సినిమాలో గోపీచంద్ లుక్ కూడా చాలా కొత్తగా ఉంది. గుబురు గడ్డంతో మ్యాచో మ్యాన్ లాగా స్తైలిష్ గా కనబడుతున్నాడు. అలాగే ఇండో – పాక్ బోర్డర్ లో వచ్చే సన్నివేశాలు.. మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయనేలా కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. 


ఇక ఈ సినిమాను దసరా పండుగ సందర్భంగా విడుదల చేస్తున్నారు. కాగా ఈ చిత్రం అవుట్ ఫుట్ పై గోపీచంద్ చాల నమ్మకంగా ఉన్నాడట.. సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వబోతుందని చిత్రబృందం కూడా చెప్పుకొస్తోంది. గోపీ చంద్ నటించిన ఈ సినిమా టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే వాళ్ళు నమ్మింది నిజం అవుతుందనే అనిపిస్తుంది.


ఈ సినిమాలో గోపీచంద్ సరసన మెహరీన్ హీరోయిన్‌ గా నటిస్తుంది. వీరిద్దరూ జంటగా నటిస్తోన్న రెండో చిత్రమిది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మరి గోపీచంద్ ఈ సినిమాతో హిట్ అందుకుంటాడేమో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: