సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. నభా నటేష్‌ కథానాయిక. ఆర్‌.ఎస్‌.నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 21న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సుధీర్‌బాబు త‌న‌ సొంత సంస్థలో నిర్మిస్తున్న తొలి చిత్రమిది. 


ప్ర‌స్తుతం సుధీర్ బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గోపిచంద్ బ‌యోపిక్ గురించి గ‌త రెండేళ్లుగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. మేటి క్రీడాకారుడు, బ్యాడ్మింట‌న్ కోచ్‌ పుల్లెల గోపిచంద్‌పై సినిమా తీస్తున్నారు అన‌గానే క్రీడాలోకం తో పాటు ఇటు అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూశారు. అయితే ఈ బ‌యోపిక్ ఇదిగో పులి అంటే అదిగో మేక అన్న చందంగా ఇన్నాళ్లు ఆల‌స్యం అవుతూనే వ‌చ్చింది. తాజాగా ఈ ప్రాజెక్టున‌కు సంబంధించి ఒక్కో ప‌ని వేగం పుంజుకుంటుంది. గోపిచంద్ స్నేహితుడు, హీరో సుధీర్‌బాబు ఈ చిత్రంలో హీరోగా న‌టించ‌నున్నాడు. తెలుగు, హిందీలో అత్యంత భారీ బ‌డ్జెట్‌తో సైమ‌ల్టేనియ‌స్‌గా చిత్రీక‌రించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌తో క‌లిసి అబుండాంటియా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్ల‌నున్నారు.


ఇక క్రీడాకారుడి పాత్ర అంటే అదో స‌వాల్‌. అందుకే ఇప్ప‌టికే గోపిచంద్ రెండు వారాల పాటు శిక్ష‌ణ తీసుకునే ప‌నిలో ఉన్నాడ‌ని తెలుస్తోంది. సుధీర్‌బాబు ఇదివ‌ర‌కూ రాష్ట్ర‌ స్థాయి బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్… పైగా పుల్లెల గోపిచంద్ గురించి పూర్తి వివ‌రం తెలిసిన స్నేహితుడు కాబ‌ట్టి ప‌ని సులువుగానే పూర్త‌వుతుంద‌ని అంతా భావిస్తున్నారు. అయితే పాత్ర కోసం ప్రిప‌రేష‌న్ మాత్రం ఇంపార్టెంట్ అని సుధీర్‌బాబు భావిస్తున్నార‌ట‌. ఇదివ‌ర‌కూ ఎం.ఎస్‌.ధోని పాత్ర‌లో న‌టించిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అచ్చుగుద్దిన‌ట్టు ధోనీలా న‌టించారు. అత‌డు కూడా రాష్ట్ర స్థాయి క్రికెట‌ర్ కావ‌డంతో ఆహార్యం అద్భుతంగా కుదిరింది. ఇక సుధీర్‌బాబు .. గోపిచంద్ ఆహార్యం కోసం ఏం చేస్తాడో చూడాలి. మ‌రోవైపు బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బ‌యోపిక్ కోసం శ్ర‌ద్ధాక‌పూర్ ప‌క్కా ప్రిప‌రేష‌న్‌తో రెడీగా ఉన్న సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: