బాలీవుడ్ టాప్ హీరోల్లో అమీర్ ఖాన్ ఒకరు.  ఆయన సినిమాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు.  లైఫ్ లో ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు చేశారు.  ఎన్నో హిట్స్ సాధించారు.  అయితే, గత కొంతకాలంగా ఈ స్టార్ హీరో విజయాల్లో వినకబడ్డాడు.  థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ సినిమా భారీ పరాజయం పాలైంది.  దీంతో ఈసారి ఎలాగైనా మంచి విజయం సాధించాలనే కసితో పనిచేస్తున్నారు.  ప్రస్తుతం హాలీవుడ్ లో సూపర్ హిట్టైన ఫారెస్ట్ గంప్ సినిమాను రీమేక్ చేస్తున్నారు. 


త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది.  ఇందులో  మరో రెండు పాత్రలు కీలకం.  ఆ రెండు పాత్రల కోసం తమిళ నటులను తీసుకోవాలని చూస్తున్నారు.  తమిళంలో విజయ్ సేతుపతి ఇప్పటికే టాప్ పొజిషన్లో ఉన్నాడు.  ప్రస్తుతం మెగాస్టార్ సైరా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ హీరో తమిళంతో పాటు ఇతర సినిమాల్లో కూడా నటిస్తుండటంతో.. విజయ్ సేతుపతికి క్రేజ్ పెరిగింది.  


ఫారెస్ట్ గంప్ సినిమాలోని ఓ పాత్ర కోసం ఆయన్ను తీసుకోవాలని అనుకుంటున్నారు.  దానికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. విజయ్ సేతుపతితో పాటు తమిళ్ కమెడియన్ యోగిబాబును కూడా ఫారెస్ట్ గంప్ లో కమెడియన్ పాత్రకు తీసుకోవాలని అనుకుంటున్నారు.  ఈ పాత్ర కూడా సినిమాకు కీలకం.  అయితే, యోగిబాబు ప్రస్తుతం కోలీవుడ్ లో మోస్ట్ వాటెండ్ బిజీ కమెడియన్ అయ్యాడు.  వడివేలు వంటి నటులు ఫేడ్ అవుట్ కావడంతో.. యోగిబాబుకు కలిసి వచ్చింది.  


తనదైన శైలిలో ఆకట్టుకుంటూ.. అవకాశాలు దక్కించుకుంటున్నారు.  స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీ అవుతున్న యోగిబాబు.. ఇప్పుడు అక్కడ టాప్ లో ఉన్నాడు.  హీరోగా అవకాశాలు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.  ఇలాంటి సమయంలో యోగిబాబు బాలీవుడ్ లో నటించేందుకు అంగీకరిస్తారా.. బాలీవుడ్ సినిమా అందులోను అమీర్ ఖాన్ మూవీ.  ఛాన్స్ ను ఎవరూ వదులుకోరు.  మరి దీన్ని యోగిబాబు ఎలా డీల్ చేస్తాడో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: