కాజల్ అగర్వాల్ గురించి అందరికి తెలుసు.  ఎప్పుడో లక్ష్మి కళ్యాణం అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. టాప్ హీరోలతో నటించింది.  వయసు పెరుగుతున్నా అందం మాత్రం తగ్గడం లేదు.  వరస సినిమాలతో దూసుకుపోతున్నది.  ఇప్పటికే ఈ స్టార్ హీరోయిన్ వయసు 35 వరకు వచ్చింది.  ఈ వయసులో అందరు పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ అవుతుంటారు.  కానీ, కాజల్ మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నది.  సినిమాలు చేతిలో ఉన్నా లేకున్నా.. గ్లామర్ విషయంలో మాత్రం వెనకడుగు వేయదు.  


సోషల్ మీడియాలో నిత్యం టాప్ పొజిషన్ లో ఉంటుంది.  రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ ఫోటోను పోస్ట్ చేసింది.  పెదవులకు లైనింగ్ చేస్తున్న ఫోటో.  ఆ ఫోటో చూస్తుంటే.. యూత్ ఎవరైనా సరే పరేషాన్ కావాల్సిందే.  ఇలాంటి ఫోటోలు కూడా కాజల్ పోస్ట్ చేస్తుందా అని ఆశ్చర్యపోవాల్సిందే. హీరోయిన్ కదా..తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేయడంలోనే ఆనందం ఉందని అనుకుంటుంది.  అందుకే అలాంటి ఫోటోలు పోస్ట్ చేస్తుంది.  


కాజల్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి.  అందులో ఒకటి ప్యారిస్ ప్యారిస్.. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యి చాలా రోజులైంది.  బాలీవుడ్ లో హిట్టైన క్వీన్ సినిమాకు ఇది రీమేక్.  దీంతో పాటు తమిళంలో ఇండియన్ 2 చేస్తున్నది.  శంకర్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది.  అటు బాలీవుడ్ లో ముంబై సాగ సినిమా చేస్తున్నది.  ఇటు టాలీవుడ్ లో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరక్కుతున్న అ 2 సినిమాలో కూడా నటిస్తోందట.  


చేతిలో సినిమాలు లేవు లేవు అనుకుంటూనే మూడు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది.  కాజల్ అంటే అదే మరి.  అవకాశాలు ఎలా తెచ్చుకోవాలో ఆమెకు బాగా తెలుసు. అవకాశాల పూర్తిగా తగ్గిపోయిన సమయంలో కూడా తెలివిగా అవకాశాలు దక్కించుకుంటోంది ఈ హీరోయిన్.  పెళ్లి ఎప్పుడు అని అడిగితె మాత్రం సమాధానం చెప్పకుండా పక్కకు తప్పుకుంటోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: