రాజమౌళి తాను తీసే సినిమాల కథలను హీరోలకు అనుగుణంగా మార్చుకోడు. అంతేకాదు అతడు తీయబోయే సన్నివేశాల గురించి హీరోలతో చర్చించడు. రాజమౌళి ఎలా భావిస్తే అలా తీస్తాడు తప్ప హీరోలను ఎలివేట్ చేయడానికి రాజమౌళి తన కథలలో మార్పులు చేయడు.

ఇలాంటి పరిస్థితులలో ఇప్పటి వరకు సుమారు 40 శాతం చిత్రీకరణ పూర్తి అయిన ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి ఫస్ట్ లుక్ ను విడుదల చేయడానికి కూడ రాజమౌళి భయపడుతున్నట్లు టాక్. దీనికి కారణం ఈ మూవీకి సంబంధించి విడుదల చేసే ఫస్ట్ లుక్ లో జూనియర్ గెటప్ హైలెట్ అయి చరణ్ లుక్ కొద్దిమాత్రం తగ్గినా దానికి సంబంధించిన విమర్శలు తారా స్థాయిలో ఉంటాయి అన్న భయంతో ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి సంబంధించి అసలు ఫస్ట్ లుక్ ఎలా డిజైన్ చేయాలి అన్న విషయంలోనే రాజమౌళికి కన్ఫ్యూజన్ కొనసాగుతున్నట్లు టాక్.

దీనివలన ‘ఆర్ ఆర్ ఆర్’ ఫస్ట్ లుక్ ఆలస్యం అవుతోంది అని అంటున్నారు. దీనికితోడు ఈ మూవీలో చరణ్ జూనియర్ లు నటించే సీన్స్ మధ్య బ్యాలెన్సింగ్ విషయంలో పెద్దగా శ్రద్ధపెట్టని రాజమౌళి ఇప్పుడు చరణ్ జూనియర్ ల అభిమానులకు భయపడి వారిద్దరి మధ్య ఉండే సన్నివేశాలలో కూడ ఒకే విధంగా హైలెట్ చేస్తూ సమతుల్యం పాటిస్తున్నట్లు టాక్..

ఇప్పటి వరకు రాజమౌళి ఎన్నో భారీ సినిమాలను తీసినా ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో ఎదుర్కుంటున్న టెన్షన్ మరే సినిమాకు రాకపోవడం కూడ రాజమౌళి కలవర పెడుతున్నట్లు టాక్. దీనితో స్వతహాగానే నెమ్మదిగా సినిమాలు తీసే రాజమౌళి చరణ్ జూనియర్ ల వీరాభిమానుల టార్చర్ కు భయపడి ఒకటికి రెండు సార్లు తీసిన సీన్ ను మరింత నిశితంగా పరిశీలిస్తూ షూటింగ్ ను కొనసాగిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: