ఎఫ్-2 బ్లాక్ బస్టర్ సక్సస్ తర్వాత మాంచి ఊపు మీదున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. ఎటువంటి పాత్రలోనైనా  ఒదిగిపోగలడని ఇటీవల వరుణ్ సినిమాలు చూస్తే అర్థమవుతోంది. ఒక కథకి ఒక కథకి సంబంధం లేకుండా సెలెక్ట్ చేసుకొని హిట్స్ అందుకుంటున్నాడు. ఇప్పుడు వాల్మీకి అంటు త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గ్యాంగ్ లీడర్ రిజల్ట్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు అందరి దృష్టి వచ్చే వారం రాబోతున్న వరుణ్ తేజ్ వాల్మీకి మీద పడుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తమిళ్ బ్లాక్ బస్టర్ జిగర్ తండా రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా కోలీవుడ్ హీరో అధర్వ మరో కీలక పాత్రలో నటించాడు. ఇప్పటికే ఈ సినిమా రన్ టైంని 2 గంటల 51 నిమిషాలకు లాక్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. 

అసలు ఒరిజినల్ వెర్షన్ కన్నా పది నిముషాలు ఎక్కువ పొడిగించడం విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంత రన్ టైం ఓకేనా.. ప్రేక్షకులు కూర్చోగలరా అంటూ సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ వరుణ్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా కూల్ గా ఉన్నాడు. ప్రేక్షకులను సరిగ్గా ఎంటర్ టైన్ చేస్తే ఎంత నిడివి ఉన్నా చూస్తారని ధీమాగా ఉన్నాడని తెలుస్తోంది. అందుకు ఉదాహరణగా అర్జున్ రెడ్డి - మహానటి - రంగస్థలం లాంటి సినిమాలను చూపిస్తున్నాడు. లగాన్ నాలుగు గంటలకు దగ్గరగా ఉన్నా అప్పట్లో రెండు ఇంటర్వెల్స్ తో ఆడియన్స్ ఎంజాయ్ చేయడాన్ని ఈ సందర్భంగా అందరికి గుర్తు చేశాడు. ఆ సినిమాతో పోల్చుకుంటే మన సినిమా రన్ టైం చాలా తక్కువే కాదా అంటున్నాడు.

అయితే వరుణ్ తేజ్ చెప్పిన ఉదాహరణలు అన్ని ఆయా భాషల్లో స్ట్రెయిట్ సబ్జెక్ట్స్ తో రూపొందిన సినిమాలు. కానీ వాల్మీకి పక్కా రీమేక్. అందులోనూ వరుణ్ తేజ్ చేసింది ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసిన నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్. హరీష్ శంకర్ మార్పులు చేయడంలో సిద్దహస్తుడు. గబ్బర్ సింగ్ తరహా మేజిక్ మరోసారి రిపీట్ చేస్తాడని మెగా ఫాన్స్ చాలా నమ్మకంతో ఉన్నారు. మరి రన్ టైం సమస్య లేకపోతే ప్రేక్షకులు ఎంటర్‌టైన్ అవడం ఖాయం. 

సైరాకు రెండు వారాల ముందు వస్తున్న వాల్మీకితో సక్సెస్ సెలెబ్రేషన్స్ మొదలు కావాలని మెగా ఫ్యాన్స్ అంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు వెంకటేష్ ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. ఇప్పటికే మిక్కీ జె మేయర్ ఆల్బమ్ మాస్ లో బాగానే రీచ్ అయ్యింది. మరి అసలు అంచనాలు అందుకోవడంలో వాల్మీకి సక్సెస్ అవుతాడా లేదా 20న తేలిసిపోతుంది. ఒకవేళ హరీష్ శంకర్ గనక గబ్బర్ సింగ్ మ్యాజిక్ ను రిపీట్ చేస్తే వరుణ్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోవడం పక్కా. 


మరింత సమాచారం తెలుసుకోండి: