మెగాస్టార్ హీరోగా చేసిన సైరా సినిమా అక్టోబర్ 2 వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్న సంగతి తెలిసిందే.  సెప్టెంబర్ 18 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక జరగబోతున్నది.  ఈ వేడుకకు పవన్, రాజమౌళి ఇద్దరు హాజరవుతున్నారు.  ఈ ఏడాది రిలీజైన భారీ చిత్రం సాహో బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవ్వడంతో.. దానిని దృష్టిలో పెట్టుకొని సైరాను జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు.  


తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు చరిత్ర కాబట్టి సినిమాపై అంచనాలు ఉంటాయి.  తెలియని వ్యక్తి గురించి తెలుసుకోవడం మనవాళ్లకు బాగా నచ్చుతుంది. అందుకే అలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సైరా టీజర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.  టీజర్ క్షణాల్లో మిలియన్ సంఖ్యలో వ్యూస్ ను సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 18 న ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రీ రిలీజ్ వేడుకలో సైరా ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు.  ట్రైలర్ ను బట్టి సినిమా ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.  


అయితే, యుకెలో ఇండియన్ సినిమా మ్యాగజైన్ ఎడిటర్, సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సందు సైరా సినిమాకు సంబంధించిన రివ్యూ ఇచ్చాడు.  ఇది సినిమా రివ్యూ కాదు.  ట్రైలర్ రివ్యూ.  సైరా సినిమా రివ్యూ చూశాను.  చాలా బాగుంది. మెగాస్టార్ చిరంజీవి ప్రతిభ ఆ ట్రైలర్ స్పష్టంగా కనిపించింది.  ట్రైలర్ ను కట్ చేసిన విధానం గూస్ బమ్స్.  మెగాస్టార్ తన అనుభవం సినిమాలో  చాలా బాగాఉపయోగపడింది .  


మెగాస్టార్ గురువుగా అమితాబ్ మెప్పించారు.  సినిమా రిలీజ్ తరువాత తప్పకుండా రికార్డులు సృష్టిస్తుందని అన్నారు.  గతంలో సాహో విషయంలో కూడా ప్రభాస్ ఇదేవిధంగా చెప్పుకొచ్చాడు.  కానీ, సాహో బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది.  సైరా విషయంలో కూడా ఉమైర్ సంధూ అలాంటి రివ్యూనే ఇచ్చారు.  మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.  సినిమా ఏ రేంజ్ లో ఉండబోతోందనే విషయం ట్రైలర్ రిలీజ్ తరువాత ఓ  అంచనాకు రావొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: