సినిమా ప్రపంచం అంటే ఇప్పుడు పరుగులు ఉరుకులు  జీవితం అని వేరేలా చెప్పనక్కర్లేదు. సినిమాల్లోకి రావాలంటే ఎంత కష్టపడాలో పడతారో, వచ్చిన అవకాశాలను నిలపెట్టుకోవడానికి కూడా అంతే కష్టపడుతుంటారు సినీ తారలు. సినిమాలోకి వచ్చాక ఎలా చేస్తే జనాలకు దగ్గరవుతారో చూస్తారు. ఇకపోతే మొదటి సినిమా సక్సెస్ అయితేనే మరో సినిమా అవకాశం వస్తుంది. ఒకవేళ ఆ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ఇంకా అడ్రస్ ఉండదు. 

కొంత మందికి అవకాశాలున్న కూడా వాటిని వాడుకోవడం రాదనే చెప్పాలి. తెలుగులో ఒకటో రెండో సినిమాలలో నటించి సైడ్ అయినా హీరోలు ఉంటె, మరో వైపు చాలా సినిమాలలో నటించి సినిమాలకు గుడ్ బై చెప్పిన హీరో లు కొంతమంది ఉన్నారు. అలా సినిమాలకు దూరమైనా తెలుగు హీరోలు ఎవరో ఎప్పుడు చూద్దాము.. 

తరుణ్ :
నువ్వేకావాలి వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించిన తరుణ్. ఆ తర్వాత చాలా సినిమాలలో నటించారు. ఈయన నటించిన సినిమాలలో దాదాపుగా చాలా సినిమాలు హిట్ గా నిలిచాయి. అయితే ఈ మధ్య కలలో సినిమాలలో నటించలేదు. కనీసం గెస్ట్ రోల్లో కూడా కనిపించలేదు. సినిమాలకు గుడ్ బై చెప్పారని అనుకుంటున్నారు. 

వడ్డే నవీన్ :
జాబిలమ్మ నీకు అంతకోపమా అంటూ పెళ్లి సినిమాలో నటించిన వడ్డే నవీన్ ప్రస్తుతం పేరు ఊరు కూడా లేకుండా ఉన్నారని అర్థమవుతుంది. ఎప్పుడో జమానా కామ్లో సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి ఫ్యామితో జీవితాన్ని కొనసాగిస్తున్నారు. 

వేణు :
హనుమాన్ జంక్షన్ వంటి పెద్ద హీరోతో నటించిన హీరో వేణు. తన కామెడీ టైమింగ్ తో అందరిని కడుపుబ్బా నవ్విస్తూ ఎన్నో సక్సెస్ సినిమాలో నటించారు. ఆయన సినిమాలు అన్ని చాలా వరకు హిట్ టాక్ తో దూసుకుపోయిన సినిమాలే ఉన్నాయి. ఈయన కూడా సీనియాలకు దూరంగానే ఉన్నాడు. 
ఇలా చుస్తే జయరాం, వరుణ్ సందేశ్, పృద్వి , నవదీప్ వంటి నటులు సినిమాలకు దూరంగా ఉన్నారని అర్థమవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: