ప్రభాస్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన హై రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో భారీ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. 14వ రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 424 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో సత్తా చాటింది. టాక్ సంగతి పక్కన పెడితే విడుదలైన మొదటి రోజు నుంచే కలెక్షన్స్ సునామీ సృష్టించింది. అన్ని ప్రాంతాల నుంచి హౌస్ ఫుల్ కలెక్షన్స్‌తో సంచలనం సృష్టించింది. ప్రభాస్ కలెక్షన్స్ పవర్ ఏంటో ఈ సినిమా రుజువు అయ్యింది.


ఈ విషయాన్ని సాహూ చిత్రాన్ని నిర్మించిన యువి క్రియేషన్స్ తన అధికార ట్విట్టర్ పేజీలో  పేరుకొనింది. సాహూ చిత్రం ప్రపంచం మొత్తంలో పది వేల థియేటర్స్ లలో అంగరంగ వైభవంగా రీలీజ్ కావడం అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమా నిర్మాణ ఖర్చు 250 కోట్లు అని నిర్మాతలు వంశీ కృష్ణ రెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్ లు తెలియ చేశారు. ఈ కలెక్షన్ మాత్రమే కాకుండా ఈ సినిమా యొక్క డిజిటల్ ప్రసారాలను "అమెజాన్ ప్రైమ్" సంస్థ పెద్ద ఎత్తునే కొనుగోలు చేసింది.


అయితే ఈ సాహూ సినిమా  పాన్ ఇండియా సినిమాగా విడుదలై అన్ని భాషల్లోనూ ప్రభంజనం సృష్టించింది. అత్యున్నత సాంకేతిక నిపుణులతో వరల్డ్ క్లాస్ సినిమాగా సుమారుగా రెండు సంవత్సరాల సమయం తీసుకున్న తరువాత  ‘సాహో’ రూపొందింది. హాలీవుడ్ సినిమాల స్థాయిలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు దర్శకుడు సుజీత్. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్, స్టంట్ కొరియోగ్రాఫర్లు పని చేశారు.

ప్రభాస్ కెరీర్‌లొనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను గ్రాండ్‌గా నిర్మించారు. శ్ర‌ద్ధా క‌పూర్ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసింది. భారీ ఖర్చుతో యూవీ క్రియేష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ లెక్కలను బట్టి చుస్తే ఇప్పటికే సాహూ నిర్మాతలు బాగానే రాబడిని సంపాదించినట్లు అర్థమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: