విక్టరీ వెంకటేష్ ఏదైనా సినిమా ప్రీ రిలీజ్ వేడుక , ఆడియో రిలీజ్ పంక్షన్  హాజరైతే చాలు ... ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందా? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇలా ఒక్కటి కాదు,  రెండు కాదు వెంకీ ... ప్రీ రిలీజ్ , ఆడియో వేడుకలకు హాజరయిన అన్ని సినిమాలు సూపర్ , డూపర్ హిట్ కావడంతో ఈ సెంటిమెంట్ సినీ పరిశ్రమలో బలంగా నాటుకుపోయింది .  సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడు సినిమా ఆడియో ఫంక్షన్ కు  వెంకటేష్ అటెండ్ అయ్యాడు ... ఆ సినిమా మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ గా హిట్ గా నిలిచింది .


  ఆ తర్వాత తన మేనల్లుడు చైతు, సమంత జంటగా  నటించిన మజిలీ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యాడు. ఇంకేముంది ... ఈ సినిమా కూడా అదిరిపోయే కలెక్షన్లు రాబట్టి ,  ఏకంగా బ్లాక్ బస్టర్  హిట్ అనిపించుకుంది.  సమంత సోలోగా నటించిన ఓ బేబీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా  వెంకటేష్ గెస్ట్ గా హాజరయ్యాడు .  ఇక చెప్పేదేముంది ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఓ  బేబీ సినిమా ఓవర్సీస్ లో  ఏకంగా మిలియన్ డాలర్స్ వర్షం కురిపించింది.  మహేష్ బాబు నటించిన  మహర్షి సినిమా ప్రీ రిలీజ్ వేడుక కు వెంకటేష్  హాజరయి  చిన్నోడు చితగ్గొడతాడు అన్నాడు .. ఆ  మాటలు అక్షరాల నిజమయ్యాయి.


మహేష్ బాబు కెరీర్ లో మహర్షి సినిమా  బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్  అయ్యింది . ఇక నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమా ప్రీ  రిలీజ్ ఈవెంట్ కు హాజరయిన  వెంకటేష్ సరదాగా , వేదికపై క్రికెట్ ఆడి థియేటర్లలో ఈ సినిమా సిక్సర్ కొడుతుందని అన్నాడు . అన్నట్లుగానే  ఆ సినిమా  సూపర్,  డూపర్ హిట్ అయి మంచి కలెక్షన్లను రాబట్టింది.  తాజాగా ఎఫ్ -2 సినిమా లో తన  కోబ్రా గా నటించిన మెగా ప్రిన్స్  వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కు వెంకీ హాజరయ్యాడు.  ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందని వెంకటేష్ చెప్పడం అన్నట్టుగానే ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండటంతో,  వెంకీ గోల్డెన్ లెగ్ మహిమ కొనసాగుతుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: