బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటిస్తున్నారు. కొమరం భీం పాత్రలో తారక్.. అల్లూరి సీతారామరాజుగా రాం చరణ్ నటిస్తున్నారు. 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా 2020 జూలై 30న రిలీజ్ ఫిక్స్ చేశారు.


ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బల్గేరియాలో జరుపుకుంటుంది. సినిమాలో కొమరం భీం పాత్రలో నటిస్తున్న ఎన్.టి.ఆర్ రియల్ టైగర్ తో ఫైట్ చేస్తాడట. యంగ్ టైగర్ తో రియల్ టైగర్ ఢీ కొడితే ఎలా ఉంటుందో థియేటర్ లో చూడాల్సిందే. బాహుబలి సినిమాలో భళ్లాదేవ బుల్ ఫైట్ అనందరిని మెప్పించింది.


అలానే ఆర్.ఆర్.ఆర్ సినిమాలో టైగర్ తో ఫైటింగ్ ఉండబోతుందట. అదికూడా తారక్ చేస్తాడని తెలుస్తుంది. నందమూరి ఫ్యాన్స్ కు ఇంతకుమించి ఏం కావాలి చెప్పండి. అసలే రాజమౌళి అందులో టైగర్ తో ఫైట్ ఆర్.ఆర్.ఆర్ సినిమా గురించి వచ్చిన ఈ అప్డేట్ సినిమాపై అంచనాలు పెంచేసింది. 


అయితే తారక్ టైగర్ తో ఫైట్ చేస్తే మరి రాం చరణ్ ఏం చేస్తాడని మెగా ఫ్యాన్స్ డౌట్స్ మొదలయ్యాయి. సినిమాలో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ శాటిస్ఫై చేసే సీన్స్ ఉన్నాయట. అలియా భట్ ఒక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్ ఎవరన్నది ఇంకా నిర్ణయించలేదు. బాహుబలితో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమాను అదే రేంజ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. తప్పకుండా బాహుబలి సృష్టించిన సంచలనాలన్ని మళ్లీ ట్రిపుల్ ఆర్ బ్రేక్ చేసే అవకాశం ఉంది. అక్టోబర్ 22న కొమరం భీం జయంతి సందర్భంగా ఆర్.ఆర్.ఆర్ నుండి తారక్ ఫస్ట్ లుక్ వస్తునిద అంటున్నారు. ఆ ఫస్ట్ లుక్ వస్తేనే కాని సినిమా అంచనాలు మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి.     



మరింత సమాచారం తెలుసుకోండి: