ముఖ్యంగా ఈ టీజర్ లో కమెడియన్ సప్తగిరి చెప్పిన 'వాడి తల ఎగరాల్సిందే .. గద్దలు క్యాచ్ పట్టాల్సిందే' అనే డైలాగ్ వైరల్ అవుతుంది. ఈ డైలాగ్ వింటేమనుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన వినయ్ విధేయ రామలోని చరణ్ విలన్ తల నరికితే ఆ తల గాల్లోకి ఎగిరి గద్దలు క్యాచ్ పట్టుకునే సీనే గుర్తుకువస్తుంది. ఈ సీన్ ఫై అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి.
ఇక ఇప్పుడు తెనాలి రామకృష్ణ లో కూడా సప్తగిరి చెప్పిన ఆ డైలాగ్ కూడా దానికి సెటైర్ గానే ఉందనే కామెంట్లు వస్తున్నాయి. ఇటీవల వరుస పరాజయాలను చవి చూసిన సందీప్ కిషన్ ఈచిత్రం ఫై భారీ ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈ చిత్రంతోనైనా సందీప్ హిట్ కొడతాడో లేదో చూడాలి. ఈ చిత్రంలో హన్సిక హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్, ఎం,మురళి శర్మ , వెన్నల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నవంబర్ లో విడుదలకానుంది.