నాని, విక్రమ్ కె కుమార్ కాంబినేషన్లో వచ్చిన సినిమా గ్యాంగ్ లీడర్. శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి హిట్ టాక్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల రుపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన గ్యాంగ్ లీడర్ కలెక్షన్లు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఉన్నాయి. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు పరవాలేదనిపించే విధంగా కలెక్షన్లు వస్తున్నాయి. రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 8 కోట్ల రుపాయలు వసూలు చేసింది. 
 
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 11 కోట్ల రుపాయలు వసూలు చేసిందని సమాచారం. సినిమాకు వస్తున్న కలెక్షన్ల ప్రకారం తొలి వారంలోనే ఈ సినిమా చాలా ఏరియాలలో బ్రేక్ ఇవెన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. నైజాం ఏరియాలో ఈ సినిమాకు 3 కోట్ల 15 లక్షల రుపాయలు, సీడెడ్ ఏరియాలో కోటి రుపాయలు, కృష్ణా జిల్లాలో 60 లక్షలు, గుంటూర్ ఏరియాలో కోటీ 11 లక్షలు, వైజాగ్ ఏరియాలో 65 లక్షలు, గోదావరి జిల్లాల్లో కోటీ 27 లక్షలు వచ్చినట్లు తెలుస్తోంది. 
 
సాధారణ కథను విక్రమ్ కె కుమార్ కథనంతో అద్భుతంగా చెప్పటంలో సఫలం అయ్యాడు. నాచురల్ స్టార్ నాని సినిమాలోని పెన్సిల్ పార్థసారథి పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ పాత్రకు తగినట్లుగా నటించింది. లక్ష్మి, శరణ్య పాత్రల్లో అద్భుతంగా నటించారు. వెన్నెల కిషోర్ సినిమాలో ఉన్నది కొన్ని సీన్లలోనే అయినప్పటికీ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించాడు. 
 
కార్తికేయ విలన్ పాత్రలో అద్భుతంగా నటించాడు. భవిష్యత్తులో కార్తికేయకు మరిన్ని విలన్ పాత్రలు వచ్చే అవకాశం కూడా ఉంది. అనిరుధ్ నేపథ్య సంగీతంతో సినిమాకు ప్రాణం పోశాడు. హలో ప్లాప్ తరువాత దర్శకుడు విక్రమ్ గ్యాంగ్ లీడర్ సినిమాతో హిట్ కొట్టటంతో విక్రమ్ కు మిడిల్ రేంజ్ హీరోల నుండి ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది. నాని ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వి అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నాని విలన్ పాత్రలో నటిస్తాడని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: