యంగ్ హీరో శర్వానంద్ కు గత కొంతకాలం నుండి సరైన హిట్ రావట్లేదు. కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన శర్వానంద్ కు గమ్యం సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ప్రస్థానం సినిమా హిట్ కావటంతో శర్వానంద్ కు హీరోగా వరుస అవకాశాలొచ్చాయి. రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలు శర్వానంద్ ను మిడిల్ రేంజ్ హీరోగా చేసాయి. శతమానం భవతి, మహానుభావుడు సినిమాలు శర్వానంద్ మార్కెట్ రేంజ్ పెంచాయి. 
 
కానీ 2017 సంవత్సరంలో వచ్చిన మహానుభావుడు సినిమా తరువాత శర్వానంద్ కు సరైన సక్సెస్ రావట్లేదు. భారీ అంచనాలతో శర్వానంద్, సాయి పల్లవి కాంబినేషన్లో వచ్చిన పడి పడి లేచే మనసు సినిమా ప్లాప్ అయింది. గత నెలలో సుధీర్ వర్మ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించిన రణ రంగం సినిమా కూడా అంచనాలను అందుకోలేక ప్లాప్ అయింది. 
 
వరుసగా సినిమాలు  ప్లాప్ అవుతూ ఉండటంతో శర్వానంద్ మార్కెట్ కూడా తగ్గుతోందని తెలుస్తుంది. ప్రస్తుతం శర్వానంద్ తమిళంలో హిట్టైన 96 మూవీ రీమేక్లో నటిస్తున్నాడు. శర్వానంద్ కు జోడీగా సమంత ఈ సినిమాలో నటిస్తోంది. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష నటించగా ఈ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ హిట్టైంది. ఈ సినిమా కన్నడ భాషలో కూడా రీమేకై అక్కడ కూడా విజయం సాధించింది. 
 
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శర్వానంద్ ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. ఇప్పటికే రెండు భాషల్లో హిట్టైన సినిమా కావటంతో ఈ సినిమా సక్సెస్ అవుతుందని శర్వానంద్ భావిస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాకు టైటిల్ ఇంకా ఫైనల్ కాలేదు. తమిళంలో 96 దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ తెలుగులో కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: